అంద‌రి ఇళ్ల‌లో ఉన్న‌ట్టే… మా ఇంట్లో గొడ‌వ‌లుః మోహ‌న్‌బాబు

అంద‌రి ఇళ్ల‌లో జ‌రుగుతున్న‌ట్టే త‌న ఇంట్లో కూడా గొడ‌వ‌లున్నాయ‌న్నారు. ఏ ఇంట్లో అయినా అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు ఇంట్లో ఆస్తి గొడ‌వ‌లు వీధికెక్కాయి. మంచు మోహ‌న్‌బాబు, ఆయ‌న చిన్న కుమారుడు మ‌నోజ్ మ‌ధ్య విభేదాల సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్పుడవి బ‌జారుకెక్క‌డంతో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. మోహ‌న్‌బాబు ఫిర్యాదు మేరకు మ‌నోజ్ దంప‌తుల‌పై పోలీసులు కేసు కూడా న‌మోదు చేశారు.

ఈ నేప‌థ్యంలో త‌న ఇంటి గొడ‌వ‌ల‌పై మోహ‌న్‌బాబు స్పందించారు. అంద‌రి ఇళ్ల‌లో జ‌రుగుతున్న‌ట్టే త‌న ఇంట్లో కూడా గొడ‌వ‌లున్నాయ‌న్నారు. ఏ ఇంట్లో అయినా అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇంటి గొడ‌వ‌ల‌ను అంత‌ర్గ‌తంగా ప‌రిష్క‌రించుకుంటార‌ని ఆయ‌న అన్నారు.

గ‌తంలో ఎన్నో కుటుంబాల గొడ‌వ‌ల‌ను తాను ప‌రిష్క‌రించిన‌ట్టు మోహ‌న్‌బాబు తెలిపారు. చాలా కుటుంబాల్ని క‌లిసేలా చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. త‌న ఇంట్లో గొడ‌వ‌ల‌పై మొద‌ట్లో ఆయ‌న ఖండించారు. అబ్బే, అలాంటిది ఏమీ లేద‌ని ఆయ‌న ఖండించారు. మంచు మ‌నోజ్‌కుమార్ గాయాల‌తో ఆస్ప‌త్రికి వెళ్ల‌డం, ఆ మ‌రుస‌టి రోజు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో మోహ‌న్‌బాబు కూడా త‌న వాద‌న వినిపించాల్సి వ‌చ్చింది.

త‌న‌కు కుమారుడు, కోడ‌లి నుంచి ప్రాణ‌హాని వుంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఆస్తి కోస‌మే మ‌నోజ్ ఇదంతా చేస్తున్నాడ‌నేది మోహ‌న్‌బాబు ఆరోప‌ణ‌. అయితే త‌న తండ్రి వాద‌న‌లో నిజం లేద‌ని మ‌నోజ్ చెబుతున్నారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని అంద‌రి ద‌గ్గ‌రికి పోతానంటున్నాడు.

8 Replies to “అంద‌రి ఇళ్ల‌లో ఉన్న‌ట్టే… మా ఇంట్లో గొడ‌వ‌లుః మోహ‌న్‌బాబు”

  1. అందరి ఇళ్లల్లో జరుగుతున్నట్టే నీ ఇంట్లో కూడా కొడుకు తండ్రికి ప్రాణహాని కలిగిస్తున్నాడు అంటున్నావన్నమాట. చాలా బాగుంది.

    ఇంటి గొడవలు ఇంటోనే పరిష్కరించుకునే ఉద్దేశ్యం ఉంటే పోలీస్ రిపోర్టులు , ప్రైవేట్ బౌన్సర్లు ఎందుకు బాసూ?

  2. అందరి ఇళ్లలో గొడవలు సహజమే.. కానీ అందరి ఇళ్లలో మీయంత అతి వుండదు, సీఎం మా బావ అని అతి ఉండదు..టీవీ ల్లో అతి వుండదు..

    అతి కి ఈ మీడియా ఫోకస్ అప్పుడు చూసాము, నవ్వుకున్నాము..

    ఇప్పుడు కూడా చూస్తాము, సాడిస్ట్ లా ఆనందిచము కానీ నవ్వుకుంటాము..

  3. అసలు కథ రాయి స్వామి. జల్ పల్లి లో వున్న మోహన్ బాబు మాన్షన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దీనిని విష్ణు అన్నియ్య కి ఇచ్చే ఉద్దేశ్యం లో మోహన్ బాబు వున్నాడు. దాని మీద అంతగా ద్రుష్టి పెట్టని మనోజ్ కు వాళ్ళ అమ్మ కోరిక మీదట పిల్లను భార్యను అక్కడకు పంపి వాళ్ళకయ్యే ఖర్చులను, మనుషులను కూడా తానే పెట్టుకున్నాడు. వాళ్ళనుఅక్కడే ఉంచాలని మనోజ్ అమ్మ కోరిక ఇప్పుడు నెరవేరడం లేదు. వీటన్నిటిని కన్నప్ప vfx పనులతో దుబాయ్ బిజీ గ ఉన్నట్టు చెప్తున్నా విష్ణు అన్నియ్య ఒక కాను ఇటు వేసి ఉంచాడు మరియు తనకి నచ్చలేదు, అక్కడి నుంచే చక్రం తిప్పాడు. తన పనివాళ్ళతో గొడవలు సృష్టించాడు. విష్ణు అన్నియ్య తలచినట్టుగానే, అవి మోహన్ బాబు మనోజ్ కొట్టుకునే స్టేజి కి వచ్చాయి.

    ఇక్కడ మోహన్ఈ బాబు చెప్తున్నట్టు ఆస్తులన్నీ అయన స్వయం సంపాదన మరియు అమ్ముకున్న, దానం చేసిన అడిగే వారు లేరు, కానీ పంపకానికి వస్తే, ఇద్దరి కుమారులకు సమన హక్కు ఉంటుందని మర్చిపోకూడదు. మోహన్ బాబు తదనంతరం ఇద్దరికీ సమానం గ విభజించాపడతాయి. కానీ మోహన్ బాబు బ్రతికి ఉండగా ఈ పంపకాలు మీడియా వాళ్ళు చూసే అవకాశం రాకపోవచ్చు. ఈ ఉదంతం లో అంతంత మాత్రం వున్నా మోహన్బాబు పరువు మూసి లో కలిసింది. ఇంకా ట్రోల్ల్స్ కి సంక్రాంతి పండగ ఒక నెల ముందే వచ్చినట్టు.అసలు కథ రాయి స్వామి. జల్ పల్లి లో వున్న మోహన్ బాబు మాన్షన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దీనిని విష్ణు అన్నియ్య కి ఇచ్చే ఉద్దేశ్యం లో మోహన్ బాబు వున్నాడు. దాని మీద అంతగా ద్రుష్టి పెట్టని మనోజ్ కు వాళ్ళ అమ్మ కోరిక మీదట పిల్లను భార్యను అక్కడకు పంపి వాళ్ళకయ్యే ఖర్చులను, మనుషులను కూడా తానే పెట్టుకున్నాడు. వాళ్ళనుఅక్కడే ఉంచాలని మనోజ్ అమ్మ కోరిక ఇప్పుడు నెరవేరడం లేదు. వీటన్నిటిని కన్నప్ప vfx పనులతో దుబాయ్ బిజీ గ ఉన్నట్టు చెప్తున్నా విష్ణు అన్నియ్య ఒక కాను ఇటు వేసి ఉంచాడు మరియు తనకి నచ్చలేదు, అక్కడి నుంచే చక్రం తిప్పాడు. తన పనివాళ్ళతో గొడవలు సృష్టించాడు. విష్ణు అన్నియ్య తలచినట్టుగానే, అవి మోహన్ బాబు మనోజ్ కొట్టుకునే స్టేజి కి వచ్చాయి.

    ఇక్కడ మోహన్ఈ బాబు చెప్తున్నట్టు ఆస్తులన్నీ అయన స్వయం సంపాదన మరియు అమ్ముకున్న, దానం చేసిన అడిగే వారు లేరు, కానీ పంపకానికి వస్తే, ఇద్దరి కుమారులకు సమన హక్కు ఉంటుందని మర్చిపోకూడదు. మోహన్ బాబు తదనంతరం ఇద్దరికీ సమానం గ విభజించాపడతాయి. కానీ మోహన్ బాబు బ్రతికి ఉండగా ఈ పంపకాలు మీడియా వాళ్ళు చూసే అవకాశం రాకపోవచ్చు. ఈ ఉదంతం లో అంతంత మాత్రం వున్నా మోహన్బాబు పరువు మూసి లో కలిసింది. ఇంకా ట్రోల్ల్స్ కి సంక్రాంతి పండగ ఒక నెల ముందే వచ్చినట్టు.

Comments are closed.