మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?

మంచు కుటుంబంలో వివాదం ఈరోజు మరింత రాజుకుంది. ఈరోజు స్వయంగా మంచు విష్ణు సీన్ లోకి ఎంటరయ్యారు.

మంచు కుటుంబంలో వివాదం ఈరోజు మరింత రాజుకుంది. ఈరోజు స్వయంగా మంచు విష్ణు సీన్ లోకి ఎంటరయ్యారు. జల్ పల్లిలోని నివాసం నుంచి మంచు మనోజ్ కు సంబంధించిన బౌన్సర్లను గేటు బయటకు పంపించారు.

తనకు రక్షణ కావాలంటూ పోలీసుల్ని కోరిన మంచు మనోజ్, ఆ వెంటనే అదనపు బౌన్సర్లను పెట్టుకున్నాడు. అప్పటికే మంచు విష్ణు మరికొంతమంది బౌన్సర్లను నియమించాడు. ఈరోజు రంగంలోకి దిగిన విష్ణు.. మంచు మనోజ్ కు చెందిన బౌన్సర్లందర్నీ బలవంతంగా బయటకు పంపించాడు.

ఆ వెంటనే మంచు మనోజ్, మౌనిక కూడా బయటకొచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తొలిసారి మీడియాతో మాట్లాడిన మనోజ్.. ఇది ఆస్తి కోసం పోరాటం కాదని, తనకు, తన పిల్లలకు రక్షణ లేదని అన్నాడు.

“నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయడం లేదు. ఇది పోరాటం కూడా కాదు. నాకు, నా భార్య సేఫ్టీకి సంబంధించిన విషయం. ఓ మగాడిగా నాతో వచ్చి డైరక్ట్ గా పోరాడండి. నా భార్య, నా 7 నెలల పాప జోలికి ఎందుకొస్తున్నారు. నా భార్యపిల్లలు ఇంట్లో ఉండగా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నేను పోలీసుల్ని రక్షణ కోరాను. నిన్న నాకు రక్షణ ఇస్తా అన్నారు. ఈరోజు ఇంటికొచ్చి నా బాడీగార్డుల్ని బెదరగొట్టి బయటకు పంపించేశారు, వేరే వాళ్లను లోపల పెట్టారు. నాకు రక్షణ ఎక్కడ. పోలీసులు ఎందుకిలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. వాళ్లకు ఏం అధికారం ఉంది. నాకు న్యాయం జరిగేవరకు ప్రపంచంలో ఉన్న అందరు ప్రముఖుల్ని కలుస్తాను.”

ఇల్లు ఖాళీ చేశారా..?

మీడియాతో మాట్లాడిన వెంటనే మంచు మనోజ్, మౌనిక బయటకు వెళ్లిపోయారు. వాళ్లు ఇల్లు ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. మంచు విష్ణు ఉన్న ప్రదేశంలో తను ఒక్క క్షణం కూడా ఉండనంటూ మనోజ్ వెళ్లిపోవడం అక్కడున్న మీడియా ప్రతినిధులకు వినిపించింది. అతడు పూర్తిగా ఇల్లు ఖాళీ చేశాడా, తాత్కాలికంగా బయటకు వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంచు మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది.

10 పాయింట్లతో లేఖ…

ఈ వివాదానికి సంబంధించి రాత్రి ఓ బహిరంగ లేఖ విడుదల చేశాడు మంచు మనోజ్. అందులో ప్రధానంగా 10 పాయింట్లను ప్రస్తావించాడు. కుటుంబ ఆస్తి కోసం తను మోహన్ బాబు ఫామ్ హౌజ్ కు రాలేదని, అమ్మ కోసం వచ్చానని తెలిపిన మనోజ్.. తన వ్యక్తిగత సిబ్బందితో మోహన్ బాబుకు గొడవ జరిగిన విషయాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావించాడు.

విష్ణు మనుషులు సీసీటీవీ ఫూటేజ్ ను మాయం చేశారని ఆరోపిస్తూనే.. విష్ణు, ఆయన సహచరుడు వినయ్, మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారని… వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడినందుకు తనపై కక్షకట్టారని మనోజ్ వాదిస్తున్నాడు. తనపై మోహన్ బాబు కంప్లయింట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఇదేనంటున్నాడు మనోజ్. యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని ప్రకటించాడు.

యూనివర్సిటీపై వివాదం

మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీపై వివాదం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలంటూ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. మోహన్ బాబు యూనివర్సిటీపై మంచు మనోజ్ స్పందనను సుమోటాగా స్వీకరించి విచారణ చేయాలని డిమాండ్ చేసింది.

యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి దగ్గర 20 వేల రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని, ఎదురు తిరిగితే బౌన్సర్లతో కొట్టిస్తున్నారని, సదరు స్టూడెంట్స్ ను ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించింది ఏఐఎస్ఎఫ్.

14 Replies to “మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?”

  1. కర్మ ఎవ్వరినీ విడిచి పెట్టదు

    2019 లో జెగ్గులు గాడి మాట విని, కాలేజీ ఫీజులు అంటూ డ్రామాలు దె0గి రోడ్లమీద దొర్లాడు.. ఇప్పుడు అదే కాలేజీలు కాపాడుకోవడం కోసం తండ్రి ‘కొడుకులే బజారున పడి కొట్టుకుంటున్నారు..

    నీ జుట్టు చంద్రబాబు చేతికి చిక్కింది రా ముంచు ము0డా కొడకా’

    1. ఒరేయ్ లోఫర్ లంజాకొడకల్లారా ఎప్పుడు మా జగన్ మోడ్డ కుడవడమేనా, నీయమ్మ శంకరాజాతి లంజాకొడకల్లారా జగన్ పేరు తలుసుకుంటేనే తడిసిపోతాందీ మీకు కొడకల్లారా

  2. ఈయన తన కొడుకుల్లో ఒకరిని IPS ఆఫీసర్, మరొకరిని సినిమా హీరో చేద్దాం అనుకున్నాడట పాపం. చివరికి ఒకడు గూండా, మరొకడు విక్టిమ్ గా తేలారు.

  3. హైదరాబాద్ లో ఉన్న బౌన్సర్లు అందరూ ఈ తండ్రి కొడుకు ల దగ్గరే ఉన్నట్లున్న్నారు

  4. హైదరాబాద్ లోని బౌన్సర్లు అందరూ మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నట్లున్నారు

Comments are closed.