‘మామయ్యది మొగల్తూరు.. మా నాన్నది పాలకొల్లు..’ అంటూ సాంగేసుకుని.. తనను తెలుగు ప్రేక్షకలోకం ఎందుకు ఆదరించాలో.. ఓ బలమైన కారణాన్ని చెప్పుకుంటూ ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు అర్జున్! చా..లా.. కాలం గ్యాప్ తరవాత.. చాలా చాలా పుకార్లు విరివిగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత.. మామయ్య చిరంజీవిని కలవడానికి స్వయంగా ఇంటికి వెళ్లారు.
పుష్ప 2 రిలీజ్ తర్వాత.. చిత్ర బృందం దర్శకుడు, నిర్మాతలు కలిసి మర్యాదపూర్వకంగా మెగాస్టార్ ను కలిసిన సందర్భంలో అల్లు అర్జున్ లేరు. జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత మాత్రం.. అరెస్టు అయినప్పుడు తనకు, కుటుంబానికి మద్దతుగా నిలిచినందుకు థాంక్స్ చెప్పదలచుకున్నారేమో.. బన్నీ స్వయంగా డ్రయివ్ చేసుకుంటూ మరీ సతీసమేతంగా మామయ్య ఇంటికి వెళ్లారు. ఇది కృతజ్ఞతాపూర్వక, మర్యాదపూర్వక భేటీగా చెప్పుకోవచ్చు.
అయితే ఇండస్ట్రీలో మాత్రం అలాంటి ఇంప్రెషన్ కలిగించడానికి అల్లు అర్జున్ మొక్కుబడిగా వెళ్లిన భేటీ మాత్రమే అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అల్లు అర్జున్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చాలా చురుగ్గా ఉండే హీరోల్లో ఒకరు. అనేక విషయాలపై ఎప్పటికప్పుడు తన స్పందనల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే మామయ్య మెగాస్టార్ తో భేటీ సంగతి మాత్రం.. ఆయన తన ఎక్స్ ఖాతలో కూడా పోస్ట్ చేసుకోలేదు.
అయితే పాన్ ఇండియా హీరో అయిన తర్వాత.. అల్లు అర్జున్ పీఆర్ టీమ్ మాత్రం.. ఆయనకంటే ఎక్కువ చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లిన సందర్భాన్ని కూడా వారు గరిష్టంగా ప్రచారానికి వాడుకున్నారు. ఆయన స్వయంగా కారు తోలుకుంటూ వెళ్లారనే సంగతి కూడా హైలైట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.
పీఆర్ టీమ్ నిర్వహించే ఏఏ టీమ్ లాంటి సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం ఘనంగా పోస్టు చేశారు. అల్లు అర్జున్ తన పర్సనల్ ఖాతాలో మాత్రం పోస్టు చేయలేదు. ఈ వ్యవహారం చూస్తోంటే.. ఇది మనస్ఫూర్తిగా వెళ్లడం కాదా? కేవలం తన ప్రచారం కోసం బన్నీ, మెగాస్టార్ చిరంజీవిని కూడా ఒక టూల్ లాగా వాడుకున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి, అల్లు అర్జున్ ను మించిన పీఆర్ టీమ్ లు ఉన్నాయి. బన్నీ అరెస్టు అయిన సందర్భంలో మెగాస్టార్.. వారి ఇంటికి వెళ్లి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అయితే అలాంటి సున్నితమైన సందర్భాలను తన ప్రచారానికి వాడుకోవాలని చిరంజీవి అనుకోలేదు. కానీ.. అల్లు అర్జున్ వ్యవహార సరళి మాత్రం కేవలం ప్రచారం కోసమే చిరజీవిని వాడుకున్నట్టుగా ఉందని పలువురు అంటున్నారు.
జగన్నాటకం లాంటి స్వచ్ఛమైన ప్రేమ
సింహలు ga చెప్పుకుంటూ తిరిగే వీళ్ళు నా పోస్ట్లు accept చేయడం లేదు… పిరికి సన్నాసులు.. వేరే id తో వేసాను
same here
same here. My comments got removed as well
He has his own image…comparing with mega is like downgrading him now…because none of the mega family heros shined outside telugu industry.
first thing to recognize is actuohero is sukumar or Trivikram…
without the director,a hero is a zero
షర్మిల ఫై జగనన్న ప్రేమ ఒరిజినలేనా అన్నట్లుంది.
G
allu ramalingaiah & allu aravind–>chiranjeevi his monkey gang.
allu ramalingaiah–>allu aravind –> allu arjun
allu arjun ki ykaapa meedha elanti prema ledhu… only personal level lo friend ki support chesaadu…party ki kaadhu…
neeku ni pe ll am prama nijamenaa ?