తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. ప్రత్యర్థుల అరెస్ట్‌పై ప్రభుత్వం దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన కేటీఆర్ హైకోర్టులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపు న్యాయవాదులు జస్టిస్ శ్రవణ్‌కుమార్ బెంచ్ ఎదుట లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ తిరస్కరించడంతో చీఫ్ జస్టిస్ బెంచ్‌ను ఆశ్రయించడం గమనార్హం. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత విచారణ జరగొచ్చని సమాచారం.
ఏసీబీ నమోదు చేసిన కేసులో వివరాలను పరిశీలిస్తే… ఈ-కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్లు దుర్వినియోగం అయినట్టు అభియోగం. ఈ మేరకు ఎంఏయూడీ సెక్రటరీ దాన కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, బీఎల్ఎన్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు.
రూ.10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థికశాఖ అనుమతి అవసరమని దాన కిశోర్ తెలిపారు. కానీ ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేక పోవడంతో హెచ్‌ఎండీఏ నిధులు మళ్లించారని, దీంతో విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్‌ఎండీఏకు అదనపు పన్ను భారమైందని దానకిశోర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఊరట దక్కుతుందా? లేక అరెస్ట్‌కు దారి తీస్తుందా? అనే ఉత్కంఠ నెలకుంది. మరోవైపు కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. తనను ఏ కేసులో అరెస్ట్ చేయాలో దిక్కుతోచక రేవంత్‌రెడ్డి సర్కార్ ఏదేదో చేస్తోందని విరుచుకుపడ్డారు.
9019471199 vc
ఆర్బాటం తో ఆరంభం నీరసంతో శుభం. పెద్దల కేసులు కోర్టు తీర్పులు లోగుట్టు పేరుమాళ కెరుక.
చట్టం ప్రకారం వర కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నిషేధమే..కానీ ప్రాక్టికల్ గా CBI..ED..IT..ఉన్నత న్యాయస్థానాల లో కూడా కట్నం ఇవ్వడం తీసుకోవడానికి ఎవ్వరూ వెనుకాడరు…సరిగ్గా అలాగే రాజకీయాలలో సర్పంచ్ నుండి కేంద్ర మంత్రుల వరకు అవినీతి అనేది సర్వ సాధారణం…ఎటొచ్చి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా అవినీతి కి పాల్పడడం ఒక్కటే పొలిటీషియన్స్ కు ఉన్న ప్రత్యామ్నాయం