ష‌ర్మిల తెలివితేట‌లు అమోఘం

అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ కేంద్రానికి లొంగిపోవ‌డం వ‌ల్లే, హ‌క్కుల్ని కాపాడుకోలేక పోతున్నామ‌నే ఆవేద‌న రాష్ట్ర ప్ర‌జ‌ల్లో వుంది.

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల తెలివితేట‌లు అమోఘం. ప్ర‌త్య‌ర్థుల్ని విమ‌ర్శించ‌డంలో ఆమె అనుస‌రిస్తున్న ప‌క్ష‌పాత విధానాల్ని ఎవ‌రూ క‌నిపెట్ట‌లేర‌ని బ‌హుశా ఆమె అనుకుంటున్నారేమో. అయితే నెటిజ‌న్లు ఆమె ద్వంద్వ విధానాల్ని ప‌సిగ‌ట్టి, సోష‌ల్ మీడియాలో సెటైర్స్ విసురుతున్నారు. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో విశాఖ ఉక్కుపై ఒక పోస్టుపెట్టారు.

కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఎన్డీఏలో భాగ‌స్వామ్య ప‌క్షాలైన టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు కూడా ఆమె చుర‌క‌లు అంటించారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డంలో మాత్రం ఆమె ప్ర‌త్యేక‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చాటుకుంటుంటారు. జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే, ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇదే చంద్ర‌బాబు, ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే… అబ్బే వాళ్ల పార్టీలు, విధానాల‌పై త‌ప్ప‌, ఇత‌ర అంశాల్ని ప్ర‌స్తావించ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోడాన్ని తాజా పోస్టే నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఆ పోస్టు ఏంటో తెలుసుకుందాం.

“విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలే. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనే. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీకి ఆంధ్రుల హక్కు మీద లేదు. విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయి. మోడీ గారి దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్ ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉంది.

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి HD కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల సహాయం అందించారు. స్టీల్ ప్లాంట్‌ను బ‌తికించారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం ఉండే JD(S)..రూ.15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే.. NDAకు ఊపిరి పోసిన టీడీపీ- జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయి. 18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనం. సాధించడం చేతకాకపోతే వెంటనే NDA భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేనలు తప్పుకోవాలి” అని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.

జ‌గ‌న్ గురించి కూడా ఇలాగే విధాన‌ప‌రంగా విమ‌ర్శ‌లు చేస్తూ వుంటే, ఎవ‌రూ ఏమీ అనుకోరు. కానీ జ‌గ‌న్‌పై ద్వేషంతో ష‌ర్మిల విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం వ‌ల్లే నెటిజ‌న్లు ఆమెను త‌ప్పు ప‌డుతున్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను అంద‌రూ క‌లిసి కాపాడుకోవాల్సిన అవ‌స‌రం వుంది. అయితే ఆ ప‌రిస్థితి ఏపీ రాజ‌కీయాల్లో కొర‌వ‌డింది. అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ కేంద్రానికి లొంగిపోవ‌డం వ‌ల్లే, హ‌క్కుల్ని కాపాడుకోలేక పోతున్నామ‌నే ఆవేద‌న రాష్ట్ర ప్ర‌జ‌ల్లో వుంది. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ గురించి ష‌ర్మిల ప్ర‌శ్నించ‌డం మంచిదే. అయితే అన్న‌నైతే ఒకలా, కాంగ్రెస్‌కు బ‌ద్ధ విరోధి అయిన ఎన్డీఏ ప‌క్ష నేత‌లపై సుతిమెత్త‌గా విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే నిల‌దీత‌కు కార‌ణ‌మ‌వుతోంది. అందుకే ష‌ర్మిల తెలివితేట‌ల‌పై నెటిజన్లు వెట‌క‌రిస్తున్నారు.

16 Replies to “ష‌ర్మిల తెలివితేట‌లు అమోఘం”

    1. అవసరమైనప్పుడు కేర్ తీసుకోవడం లేనప్పుడు టైం లేదు అని చెప్పడం మీకు అలవాటే కదా

  1. A1 చేతిలో మోసపోయిన తెలివితేటలే

    “సింగల్ సింహాని”కి “రెండు సింగిల్స్(11)” వచ్చేలా చేసి0ది మర్చిపోతే ఎలా??

  2. తమను మించి పక్షపాతం ప్రదర్శించే వారు ఈ భూ ప్రపంచం లో ఎవరైనా ఉన్నారా గ్యాస్ ఆంధ్ర . జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నాడు విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి ఆయన ఏమి చేశాడో ఒక మాట చెప్పండి.

    పదే పదే కేంద్రం వారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను చేస్తామని దండోరా వేయించిన అన్న చీమ కుట్టినట్టుగా కూడా అనిపించలే . 22 మంది ఎంపీలు ఉండి ఏం చేశారో చెప్పండి. ప్రత్యేక హోదా తెచ్చారా, రైల్వే జోన్ తెచ్చారా , పోలవరం పూర్తి చేశారా, ఆ వదలబోతు అనిల్ గారు 2021 నీళ్లు ఇస్తామని చెప్పాడు ఎక్కడ వాడు? ఏ నాయనా విషకు ఉక్కు పరిశ్రమ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడా ? ఆయన ఏం చేయకపోయినా చెల్లి పోయింది వీరు వచ్చి ఆరు నెల లోనే అన్ని చేయాలి అట వారెవ్వా ఏమి రాజనీతి ? 2000 ఉన్న పెన్షన్ 3000 చేయడానికి ఐదేళ్లు పట్టింది జ్ఞాపకం ఉందా.

    మరి దాని గురించి ఒక్కనాడు అయినా విమర్శించావా? పల్లెత్తమాటన్నావా ? ఆయనదైతే ఒక లెక్క ఇంకొకతే ఇంకో లెక్క. ఎవరు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నా రో మీకు తప్ప ప్రపంచ మొత్తానికి తెలుసు . నువ్వు ఒక వేలు ఎదుటివారిని చూపిస్తే 4 వేళ్ళు నిన్ను చూపిస్తాయి అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు .

Comments are closed.