విలక్షణ నటుడు మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. జర్నలిస్ట్‌పై దాడి కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ, సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్లో ఆయన పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నానని, కావున బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు. మోహన్‌బాబు పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సర్వోన్నత న్యాయ స్థానంలో తనకు ఊరట లభిస్తుందని మోహన్‌బాబు ఆశిస్తున్నారు.
ఇదిలా వుండగా మోహన్‌బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం, వీధిన పడిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మోహన్‌బాబు, మిగిలిన కుటుంబ సభ్యులు అనే రీతిలో రచ్చ సాగింది. పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో ఏ మాత్రం నిజం లేదని ఆయన తల్లి నిర్మల కూడా పోలీసులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో మంచు మనోజ్ ఒంటరి అయ్యారనే చర్చకు తెరలేచింది.
సుప్రీంకోర్టులో మోహన్‌బాబు ఆశించినట్టు ఉపశమనం లభిస్తే… మంచిదే. లేదంటే ఆయన అరెస్ట్ తప్పదు. ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానమే మోహన్‌బాబు పిటిషన్లో పేర్కొన్న విషయాలను పరిగణలోకి తీసుకోకపోతే, ఇక ఆయన బెయిల్‌కు మార్గాలు మూసుకుపోయినట్టే!
గుండె సమస్యో గుత్తి సమస్యో
Satyameva Jayathe
Yeee age lo yendhuku athani ibandhi pedattaru family godavalni road ki yendhuku
He is a excellent actor
హతవిధి ఏం రోజులు వచ్చాయి స్వయం ప్రకటిత లెజెండ్ కి, ఒకప్పుడు స్టేజ్ ల మీద ఈయన వయసు గురించి ఎత్తితే వాల్లని చా వ దె 0గే వాడు , అలాంటిది అసలు వయస్సు కన్నా 6 ఏళ్ళు ఎక్కువ చెప్పుకుని బెయిల్ కోసం తిరుగుతుండు