ఆ దర్శకుడు మాకొద్దు..!

చూస్తుంటే.. మోక్ష్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్టుకు సంబంధించి తెరవెనక ఏదో జరుగుతున్నట్టే ఉంది.

కొడుకును గ్రాండ్ గా టాలీవుడ్ కు పరిచయం చేద్దామనుకున్న బాలకృష్ణ ఆలోచనకు ఆదిలోనే స్పీడ్ బ్రేకర్ పడిన సంగతి తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞ సినిమా, ప్రకటనకే పరిమితమైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్ష్ హీరోగా సినిమా వస్తుందా రాదా అనే సందేహాలు కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

అటు బాలకృష్ణ, ఇటు నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, డౌట్స్ మాత్రం అలానే ఉన్నాయి. ఈ గ్యాప్ లో నందమూరి అభిమానుల నుంచి కొత్త డిమాండ్ ఊపందుకుంది.

నందమూరి మోక్ష్ ను పక్కా మాస్-కమర్షియల్ సినిమాతో లాంచ్ చేయాలని బాలయ్యను కోరుతున్నారు అతడి అభిమానులు. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడి నుంచి మాస్ ఎలిమెంట్స్ ను ఆశించలేమని, కాబట్టి తాత్కాలికంగా అతడ్ని పక్కనపెట్టి, మరో స్టార్ దర్శకుడితో మోక్ష్ ను పరిచయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో తాజాగా మొదలైన ఈ చర్చ వెనక ఓ ఆసక్తికరమైన విశేషం దాగుంది. ఇది ఫ్యాన్స్ నుంచి పుట్టుకొచ్చిన డిస్కషన్ కాదు. నందమూరి కాంపౌండ్ కు చెందిన కొంతమంది వ్యక్తులు ఫీలర్లు వదిలిన తర్వాత ట్విట్టర్ లో మొదలైన చర్చ ఇది.

చూస్తుంటే.. మోక్ష్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్టుకు సంబంధించి తెరవెనక ఏదో జరుగుతున్నట్టే ఉంది. అందరూ ఊహిస్తున్నట్టు ఇదేదో చిన్న చిన్న కారణాలతో లేట్ అవుతున్న ప్రాజెక్టులా లేదు.

10 Replies to “ఆ దర్శకుడు మాకొద్దు..!”

  1. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు,నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి

  2. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి

  3. ఫ్యాన్స్ వద్దనడం కాదు, ప్రశాంత్ వర్మే చేయను మొర్రో అంటున్నాడట. ప్రశాంత్ వర్మని బాలయ్య ….తగు విధంగా సత్కరించాడట

Comments are closed.