పచ్చదళాలకు బకాయి ఉండరాదు!

చంద్రబాబు నాయుడు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు నాయుడు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసుశాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై వివరాలు తెలుసుకుని వాటిని క్లియర్ చేయాల్సిందిగా సూచించారు.

చిన్న స్థాయి పనులు పూర్తిచేసి పదేళ్లుగా పెండింగులో ఉన్న బిల్లులు ఇవ్వడం గురించి ప్రధానంగా దృష్టి పెట్టాలని చంద్రబాబునాయుడు ఆదేశించడం గమనార్హం. పదేళ్లనాటి పెండింగ్ బిల్లులు అంటున్నారంటే దాని అర్థం.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల బిల్లులన్నీ వెంటనే క్లియర్ చేయాలని, అప్పట్లో కాంట్రాక్టులు చేసిన తెలుగుదేశం వారెవ్వరికీ బిల్లులు పెడింగు ఉండరాదని ఆదేశించినట్టుగానే కనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు ఇప్పటికైనా బిల్లులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమే గానీ.. ఇప్పటికే తమ బతుకులు పూర్తిగా చితికిపోయాయని తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్న చిన్న కాంట్రాక్టర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ చిన్న నాయకులు, కార్యకర్తలను గత ప్రభుత్వ కాలంలోనే చంద్రబాబునాయుడే స్వయంగా దెబ్బకొట్టారని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పుడు చంద్రబాబు మాటల్లో కూడా ఆ విషయం ఇండైరక్టుగా ధ్రువపడుతోంది. ఎందుకంటే.. తెలుగుదేశం హయాంలో పనులు చేసిన వారికి జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఇవ్వకుండా వేధించారని ఆరోపించాలంటే.. బిల్లులు మహా అయిదే అయిదారేళ్లుగా మాత్రమే పెండింగులో ఉండాలి.

అలా కాకుండా పదేళ్ల బట్టీ పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని అంటున్నారంటే దాని అర్థం ఏమిటన్నమాట..? తెలుగుదేశం గతంలో గద్దె ఎక్కిన తర్వాత.. అప్పుడు పనులు చేసిన వారికి ఆ అయిదేళ్లలో కూడా బిల్లులు చెల్లించకుండా మోసం చేశారనే కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చంగా ఇలాంటి పొరబాటే చేశారు. తన హయాంలో పనులు చేసిన తమ పార్టీ చిన్న నాయకులకు కూడా బిల్లులు చెల్లించకుండా పెండింగులో పెట్టారు. బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం.. పదవీకాలం ముగిసే ముందు కూడా వందల కోట్ల బిల్లులు క్లియర్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఏదైనా సరే.. వారిని నమ్ముకుని కాంట్రాక్టు పనులు చేస్తున్న చిన్న స్థాయి నాయకులు చితికిపోతున్నారు.. అనే మాట ప్రజల్లో వినిపిస్తోంది.

పదేళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు పెండింగ్ బిల్లులు చెల్లించినా సరే.. ఆ కాంట్రాక్టర్లు తేరుకోగలరా? అప్పటినుంచి ఆ పనులకోసం తెచ్చిన అప్పులపై వడ్డీలు ఎంతకు చేరుకుని ఉంటాయో కదా అనే వాదన వినిపిస్తోంది.

5 Replies to “పచ్చదళాలకు బకాయి ఉండరాదు!”

  1. ఇక జగన్ రెడ్డి కి ఆ 11 కూడా అనుమానమే..

    జగన్ రెడ్డి పార్టీ ని పూర్తిగా నేల నాకించేస్తున్నారు..

    బాయ్ బాయ్ వైసీపీ.. బాయ్ బాయ్ జగన్ రెడ్డి..

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.