జ‌గ‌న్ విధానం బెదిరించ‌డం, క‌క్ష క‌ట్ట‌డం

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ళ్ల‌లో ఆనందం చూడ‌డానికేమో అనే విమ‌ర్శ వైసీపీ నుంచి వ‌స్తోంది.

వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన నాయ‌కుల్లో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కొలుసు పార్థ‌సార‌థి అదృష్ట‌వంతులు. కూట‌మి సునామీలో మ‌హామ‌హులు ఓడిపోయారు. అయితే పార్టీ మారి, టీడీపీ నుంచి గెలుపొంద‌డ‌మే కాకుండా, మంత్రి ప‌ద‌వులు కూడా ద‌క్కించుకున్న నాయ‌కులుగా ఆనం, కొలుసు రికార్డు సృష్టించారు. ఈ ఇద్ద‌రు నాయ‌కులు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నాయ‌కుల‌పై వ‌రుస‌గా విరుచుకుప‌డ‌డం చూస్తే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ళ్ల‌లో ఆనందం చూడ‌డానికేమో అనే విమ‌ర్శ వైసీపీ నుంచి వ‌స్తోంది.

తాజాగా మంత్రి కొలుసు పార్థ‌సార‌థి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్ విధానం బెదిరించ‌డం, క‌క్ష క‌ట్ట‌డం అని విమ‌ర్శించారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లొస్తాయంటున్న జ‌గ‌న్‌వి ప‌గ‌టి క‌ల‌లా? రాత్రి క‌ల‌లా? అని ఆయ‌న ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి మార‌క‌పోవ‌డంతో ఆయ‌న పార్టీని నాయ‌కులు వీడుతున్నార‌ని అన్నారు.

సంక్రాంతి పండుగ కేవ‌లం ప‌చ్చ నేత‌ల‌కే అని వైసీపీ నేత‌లు విమ‌ర్శించ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఏడు నెల‌ల్లో ఎలాంటి మంచి ప‌నులు చేసిందో ఆయ‌న వివ‌రించారు. త‌మ ప్ర‌భుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. గ‌త ప్ర‌భుత్వంలో రైతుల నుంచి ధాన్యం సేక‌రించి డ‌బ్బు ఎగ్గొట్టార‌ని, ఆ సొమ్మును త‌మ ప్ర‌భుత్వం చెల్లించింద‌న్నారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా గాలి మాట‌లు మాట్లాడుతున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. వైసీపీ ఎందుకు ఖాళీ అవుతున్న‌దో ఇప్ప‌టికైనా తెలుసుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

6 Replies to “జ‌గ‌న్ విధానం బెదిరించ‌డం, క‌క్ష క‌ట్ట‌డం”

  1. నాలుగు నెలల్లో ప్రభుత్వం మారిపోతుందని చెప్పుకుని తిరుగుతున్నాడు..

    ఇదేమైనా గేమ్ ప్లాన్ ఉందనుకోవచ్చా..

    జగన్ రెడ్డి లాయర్లు ఈ పిచ్చి మాటలు కోర్ట్ లో జడ్జి కి చూపించి.. జగన్ రెడ్డి కి పిచ్చి ముదిరిపోతోంది.. అర్జెంటు గా లండన్ పిచ్చాసుపత్రి కి వెళ్లాలని .. లండన్ ట్రిప్ కి పాస్పోర్ట్ అడగాలని.. ఈ డ్రామా మొదలెట్టారా..?

    ఏమో .. ఉండొచ్చు..

    ఈ పిచ్చోడి ఆటలు ఊహాతీతం.. ఇట్టే దొరికిపోతుంటాడు..

    1. Jagan pichoda?

      jagan chesinavanni okkoti manchivi ayipothunnayi..3 yrs అయ్యేటప్పటికి jagan చేసినవి తప్ప migathavi kanapadavu.

      Endukante కూటమి ami cheyaledu..రాసి pettukondi చూడడము.

      7 months లో కూటమి ami cheyagaligindo చెప్పండి…cheppagalara…reply ivvandi

      1. ఎందుకు అంత కష్టపడుతున్నారు..

        జగన్ రెడ్డి ఐదేళ్లలో ఏమీ చేయలేదు కాబట్టే.. జనాలు 11 ఇచ్చారు..

        మీ లెక్క 4 లక్షల కోట్లు సంక్షేమం.. జనాల లెక్క 11..

        మీరు నిజం గా మంచి చేస్తే.. జనాలు ఎందుకు వదులుకొంటారు.. మీ భజన లో తప్పితే అక్కడ జనాల్లో మీ విలువ.. 11..

  2. ఏరు దాటక ముందు ఓడ మల్లయ్య, దాటాక బోడి మల్లయ్య అంటే ఇదే. బెదిరించడం , కక్ష కట్టడం విధానం అయితే ఆడి పార్టీ లో ఎలా పనిచేసావు ? ఎందుకు పనిచేసావు ?

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.