గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి వచ్చింది, మెగా ఫ్యాన్స్ ఒకింత హ్యాపీగానే ఉన్నారు. అయితే వాళ్ల మనసుల్లో ఏదో తెలియని వెలితి. దీనికి కారణం విశ్వంభర. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర సినిమా ఈ పాటికి థియేటర్లలోకొచ్చి 3 రోజులై ఉండేది. కానీ అలా జరగలేదు.
సంక్రాంతి సినిమాల్లో అందరికంటే ముందు విడుదల తేదీని ప్రకటించింది విశ్వంభర యూనిట్. జనవరి 10న థియేటర్లలోకి వస్తామంటూ డేట్ తో సహా వెల్లడించింది. అయితే ఆఖరి నిమిషంలో గేమ్ ఛేంజర్ సీన్ లోకి రావడంతో.. కొడుకు సినిమా కోసం తండ్రి చిరంజీవి తన సినిమా విడుదల తేదీని త్యాగం చేశారు.
అలా విశ్వంభర వాయిదా పడడం, ఆ తేదీకి గేమ్ ఛేంజర్ రావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మరోసారి విశ్వంభర సినిమాను గుర్తుచేసుకుంటున్నారు చిరంజీవి అభిమానులు. బాలకృష్ణ సినిమా మీద చిరంజీవి మూవీ వస్తే ఆ మజానే వేరు అంటూ చర్చించుకుంటున్నారు.
చిరంజీవి నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఈ పండక్కి సినిమా పక్కా అనుకున్నారు. కానీ లెక్కలు మారిపోయాయి. ఈ పండక్కి ఫ్యాన్స్ లో ఆనందం నింపాలంటే, విశ్వంభర రిలీజ్ డేట్ ప్రకటించాలి. కనీసం సినిమా నుంచి కొత్త పోస్టరైనా రిలీజ్ చేయాలి. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం జరగలేదు.
వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోంది విశ్వంభర సినిమా. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
టైటిల్ చదివితే జయంతికో వర్ధంతికో స్మరించుకున్నట్టు ఉంది
Ippudu veedi sthai vijay devarakonda tho samanam.