బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి, అతడ్ని తీవ్రంగా గాయపరిచిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున, అనుమానితుడు బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో చివరిగా కనిపించాడని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత, అనుమానితుడు ఈరోజు ఉదయాన్నే తొలి లోకల్ రైలును పట్టుకుని వసాయ్ విరార్ వైపు వెళ్లినట్లు గుర్తించారు.
అలా అతడ్ని వెంటాడి అదుపులోకి తీసుకొని బాంద్రా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడెవరు.. అతడి వెనక ఉన్న వ్యక్తులెవరు.. సైఫ్ పై దాడి వెనక ఉద్దేశం ఏంటి లాంటి వివరాల్ని రాబట్టే పనిలో ఉన్నారు.
సైఫ్ పై కత్తితో దాడి చేసిన వెంటనే బాంద్రా పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అటు క్రైమ్ బ్రాంచ్ నుంచి కూడా మరో 10 బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. సైఫ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా నిందితుడ్ని గంటల వ్యవధిలో గుర్తించారు.
పోలీసులకు పని మనిషి ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫైర్ ఎగ్జిట్ మెట్ల ద్వారా సైఫ్ ఇంట్లోకి చేరుకున్నాడు దుండగుడు. నేరుగా సైఫ్ కొడుకులు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. దుండగుడ్ని చూసిన వెంటనే పని మనిషి ఒక్కసారిగా అరవడంతో సైఫ్ గదిలోకి వచ్చాడు. సైఫ్ ను చూడగానే దుండగుడు కత్తితో దాడి చేశాడు.
మెడ, వీపు, చేతులు, తలతో సహా 6 చోట్ల కత్తిపోట్లకు గురయ్యాడు. సైఫ్ వెన్నెముకకు దగ్గరగా దిగిన రెండున్నర అంగుళాల కత్తిమొనను వైద్యులు తొలిగించారు. ఆ కత్తి మొనను విచారణ నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దాడి సమయంలో ఇంట్లో ఆరుగురు పని మనుషులున్నారు. సైఫ్ మొదటి భార్య కొడుకు ఇబ్రహీం, కూతురు సారా అలీ ఖాన్ కూడా అదే భవనంలోని ఎనిమిదో అంతస్తులో నివసిస్తున్నారు. దాడి విషయం తెలుసుకున్న వెంటనే ఇబ్రహీం, తండ్రిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించాడు.
ఈ కేసును పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గంటల వ్యవథిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు