చేపల పులుసు అందరూ చేస్తారు, చాలామంది తింటారు. కానీ నాగచైతన్య చేసిన చేపల పులుసు తినే అవకాశం అందరికీ దొరకదు. ఆ అదృష్టం కొందరికే దక్కింది. నాగచైతన్య స్వయంగా తన చేత్తో చేపల పులుసు వండాడు.
తండేల్ సినిమా షూటింగ్ సందర్భంగా కొంతమంది మత్స్యకారులకు నాగచైతన్య స్వయంగా తన చేత్తో చేపల పులుసు చేసి వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా యూనిట్ రిలీజ్ చేసింది. చైతూ ఇలా వంట చేయడం వెనక ఓ చిన్న రీజన్ కూడా ఉంది.
తండేల్ సినిమా షూటింగ్ మొదలుపెట్టకముందు, కొన్ని మత్స్యకార గ్రామాల్ని సందర్శించాడు నాగచైతన్య. వాళ్లు వండిపెట్టిన ఆహారం తిన్నాడు. అప్పుడే వాళ్లకు ప్రామిస్ చేశాడు. ఏదో ఒక రోజు తను కూడా వాళ్ల కోసం చేపల పులుసు చేస్తానని మాటిచ్చాడు. చెప్పినట్టుగానే వండి చూపించాడు.
ఫస్ట్ టైమ్ చేపల పులుసు చేశానని, బాగా లేకపోతే ఏం అనుకోవద్దని రిక్వెస్ట్ చేశాడు. పులుసు సూపర్ గా ఉందంటూ లొట్టలేసుకొని మరీ తిన్నారు స్థానికులు.
చేపల పులుసు చేయడం నాగచైతన్యకు కొత్త కావొచ్చు కానీ వంట మాత్రం కాదు. టైమ్ దొరికిన ప్రతిసారి ఇంట్లో వంట చేయడానికి ఆసక్తి చూపిస్తాడు చైతూ. కాకపోతే ఇండియన్ రుచులు కంటే మెడిటేరియన్ రెసిపీలు ఎక్కువగా ట్రై చేస్తుంటాడు. నాగచైతన్యకు ఫుడ్ లో మంచి టేస్ట్ ఉంది. అతడికి హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ కూడా ఉంది.
Yeedi bathukkki okka hit ledu and raadu, life long ila chepala pulusu pittaparigalu vandukoni bathukovadame
You are great chaithu
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు