సక్సెస్ ఇచ్చే కిక్ ను ఎంజాయ్ చేద్దామనుకునేలోపే మరో ఎదురుదెబ్బ సిద్ధంగా ఉంటుంది. రీసెంట్ గా బన్నీ విషయంలో అదే జరిగింది. పుష్ప-2 పెద్ద హిట్టయింది. ఇండియాలోనే నంబర్ వన్ మూవీగా అవతరించింది. అయితే ఆ సక్సెస్ ను అతడు పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయాడు. దిల్ రాజు కూడా అంతే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్టయింది. కానీ పూర్తిస్థాయిలో ఆస్వాదించలేని పరిస్థితి.
కొన్ని రోజుల కిందటి సంగతి. పుష్ప-2 రిలీజైంది. దేశవ్యాప్తంగా హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించింది. ఇక పండగ చేసుకోవడమే ఆలస్యం అనుకునే టైమ్ లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది.
అంతే, ఒక్కసారిగా సక్సెస్ సంబరాలన్నీ ఆగిపోయాయి. అక్కడితో అయిపోలేదు. జీవితంలో మొదటిసారి అరెస్టయ్యాడు బన్నీ, ఒక రాత్రి జైలు జీవితం కూడా గడిపాడు. ఆ తర్వాత కోర్టు కేసులు, బెయిల్.. ఇలా పుష్ప-2 సక్సెస్ ను ఆస్వాదించలేకపోయాడు అల్లు అర్జున్.
బన్నీ టైపులోనే దిల్ రాజు కూడా..
ఇప్పుడు దిల్ రాజు పరిస్థితి కూడా ఇలానే ఉంది. వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్టయింది. కానీ ఆ విజయాన్ని పూర్తిస్థాయిలో ఆనందించలేకపోతున్నాడు రాజు. దీనికి కారణం ‘గేమ్ ఛేంజర్’.
దిల్ రాజు కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 50వ చిత్రం ఇది. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందనుకున్నాడు దిల్ రాజు. కానీ అలా జరక్కపోవడంతో డీలా పడ్డాడు. దీనికితోడు, పైరసీ ఒకటి. అది కూడా అలాంటిలాంటి పైరసీ కాదు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా గేమ్ ఛేంజర్ సినిమాను వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఓ కేబుల్ టీవీ నెట్ వర్క్ అయితే, ఏకంగా ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేసింది. దీంతో దిల్ రాజు పైరసీకి సంబంధించి 45 మందిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు. అటు అక్రమంగా గేమ్ ఛేంజర్ ను ప్రసారం చేసిన కేబుల్ టీవీ యాజమాన్యం కూడా అరెస్టయింది.
ఇలా ఓవైపు పోలీస్ కేసులు నడుస్తున్న వేళ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు దిల్ రాజు.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
Whose number it is?