బాలయ్య అభిమానులపై కేసు

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో జంతుబలికి సంబంధించిన సెక్షన్ల కింద ఐదుగురు బాలయ్య అభిమానులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

‘డాకు మహారాజ్’ విడుదల సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అత్సుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. రిలీజ్ రోజున తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ వద్ద బాలకృష్ణ కటౌట్ ముందు పొట్టేల్ ను బలిచ్చారు. ఆ రక్తాన్ని కటౌట్ కు పూయడంతో పాటు, బాలకృష్ణకు ఇష్టమైన బ్రాండ్ తో అభిషేకం కూడా చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భలేగా వైరల్ అయ్యామని బాలయ్య ఫ్యాన్స్ సంబర పడ్డారు. కానీ వాళ్లపై కేసు పడింది. ఎఫ్ఐఆర్ నమోదైంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో జంతుబలికి సంబంధించిన సెక్షన్ల కింద ఐదుగురు బాలయ్య అభిమానులపై కేసు నమోదు చేశారు పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా పెటా స్పందించింది. జంతువును చంపి, ఆ రక్తాన్ని పోస్టర్ పై పూసి హంగామా చేస్తే సూపర్ ఫ్యాన్ అనిపించుకోరని.. నిజానికి అది సదరు ఫ్యాన్స్ ను విలన్లుగా మారుస్తుందని, ఇబ్బందులకు గురిచేస్తుందని వెల్లడించింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, లైసెన్స్ పొందిన కబేళాలతో మాత్రమే జంతు వధకు అనుమతి ఉంది. మరీ ముఖ్యంగా సినిమా హాళ్ల లాంటి పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటివి పూర్తి నిషిద్ధం. ఇదే విషయాన్ని గుర్తుచేసిన పెటా, జంతు బలులు ఇచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

9 Replies to “బాలయ్య అభిమానులపై కేసు”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.