కుక్కలతో పోల్చుకుంటూ.. మంచు ఫ్యామిలీ ట్వీట్ వార్!

సింహం అవ్వాల‌ని ప్ర‌తి కుక్కకు ఉంటుంది. కానీ వీధిలో మొర‌గ‌డానికి అడ‌విలో గ‌ర్జించ‌డానికి ఉన్న తేడా క‌నీసం వ‌చ్చే జ‌న్మ‌లోనైనా తెలుసుకుంటావ్

మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. రెండు వారాల క్రితం హైదరాబాదులో నాలుగు రోజుల పాటు సాగిన వారి ఫ్యామిలీ డ్రామా పోలీస్ స్టేషన్, కోర్టు మధ్య తిరిగింది. కోర్టు విచారణతో ఈ సమస్య ముగుస్తుందని అనుకుంటే, సంక్రాంతి పండగ సందర్భంగా మళ్లీ చిలికినట్లు కనిపిస్తోంది.

సంక్రాంతి పండగ సందర్భంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు త‌మ కుటుంబంతో కలిసి తిరుపతిలోని తమ‌ కాలేజీలో పండగ చేసుకున్నారు. భోగి వేడుకలు జరుపుకుంటూ ఆనందంగా గడిపారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. మీడియాతో సైతం మోహన్ బాబు సరదాగా మాట్లాడారు.

ఇది కొనసాగుతుండగానే మంచు మనోజ్ కాలేజీ ద‌గ్గ‌ర‌ పెద్ద రచ్చ చేశారు. మోహ‌న్ బాబు కోర్టు ఆర్డర్ తీసుకువచ్చినా, ఆయన పట్టుదలతో కాలేజీ ప్రాంగణానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసుల సమక్షంలో తన తాత‌ సమాధి వద్దకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కాలేజీలో జరిగే విషయాలపై, త‌న అన్న‌పై మంచు మనోజ్ విమర్శలు చేశారు.

తాజాగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ట్వీట్ల వార్ మొదలైంది. మంచు విష్ణు మొద‌ట‌ తన ట్వీట్‌లో “సింహం అవ్వాల‌ని ప్ర‌తి కుక్కకు ఉంటుంది. కానీ వీధిలో మొర‌గ‌డానికి అడ‌విలో గ‌ర్జించ‌డానికి ఉన్న తేడా క‌నీసం వ‌చ్చే జ‌న్మ‌లోనైనా తెలుసుకుంటావ్” అని రౌడీ సినిమాలోని డైలాగ్స్‌ను ట్వీట్‌ చేయగా, మనోజ్ “క‌న్న‌ప్ప‌లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు గారిలా సింహం అవ్వాల‌ని ప్ర‌తి ఫ్రాడ్ కుక్కకు ఉంటుంది. ఈ విష‌యం నువ్వు ఇదే జ‌న్మ‌లో తెలుసుకుంటావ్” అని మ‌నోజ్ ట్వీట్ చేశారు. దీంతో మ‌రోసారి మంచు ఫ్యామిలీ మీడియాకు ఎక్కింది.

12 Replies to “కుక్కలతో పోల్చుకుంటూ.. మంచు ఫ్యామిలీ ట్వీట్ వార్!”

    1. బటన్ బఫున్ తో పోల్చుకోవడం వాళ్లకి ఇష్టం లేదేమో.. అంత దిగజారిపోలేదని వాళ్ళ నమ్మకం కాబోలు..

  1. మరోhan బాబు మోహన్ బాబు ఎప్పుడూ క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటూ అందరికీ క్లాసులు పీకేవాడు. కానీ అతడి కొడుకులు ఇప్పుడు ఇలా వీధుల్లో కుక్కల్లా కలబడుతుంటే చూడ్డానికి భలే ఖుషీగా ఉంది.

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. క్రమం తప్పకుండా తమకి తామే శిక్షలు వేసుకోవడమే క్రమశిక్షణ అనుకుంటునట్టున్నారుని.

Comments are closed.