ఐ-ప్యాక్‌.. వైసీపీ పాలిట‌ ప్యాక‌ప్ టీమ్‌!

మాన‌సికంగా ద‌గ్గ‌ర‌య్యే వాళ్ల‌ను వ‌దిలేసి, డ‌బ్బు కోసం మాయ మాట‌లు చెప్పే ఐ-ప్యాక్ టీమ్ పీడ‌ను ఇప్ప‌టికైనా విడిపించుకోక‌పోతే, జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే, వైసీపీని ఆ దేవుడే కాపాడాలి.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సొంత పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కంటే ఐ-ప్యాక్ అంటే అపార న‌మ్మ‌కం. న‌మ్మితేనే నాశ‌నం అవుతార‌నే నానుడి వుంది. దేన్నైనా గుడ్డిగా న‌మ్మ‌డం, అలాగే వ్య‌తిరేకించ‌డం చేయ‌కూడ‌దు. అన్నీ ఆలోచించి, మంచీచెడుల‌పై అంచ‌నాకు రావాల్సి వుంటుంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీని న‌డ‌ప‌డానికి ఒక ప్రైవేట్ సంస్థ కావాల‌ని ఆలోచించారు.

ఈ క్ర‌మంలో ప్ర‌శాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకే టీమ్ 2019 ఎన్నిక‌ల కోసం ప‌ని చేసింది. ఆ ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ , 22 లోక్‌స‌భ సీట్ల‌ను సొంతం చేసుకోడానికి త‌న పాద‌యాత్ర కంటే, పీకే టీమ్ కృషే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ సైతం న‌మ్మారు. వైసీపీకి 2024 ఎన్నిక‌ల్లో కోలుకోలేని దెబ్బ ప‌డ‌డానికి 2019లో అప‌రిమిత‌మైన అధికారం బీజం వేసింది. వైసీపీకి ఎన్నిక‌ల్లో ప‌ని చేయ‌డానికి పీకే స్థానంలో ఐ-ప్యాక్ వ‌చ్చింది.

పళ్లూడ‌కొట్ట‌డానికి ఏ రాయి అయితేనేం అన్న చందంగా మారింది. వైసీపీ నాయ‌కులపై ఐ-ప్యాక్ పెత్త‌నం ప్రారంభించింది. దీంతో నాయ‌కుల్లో విసుగు, ఆగ్ర‌హం మొద‌ల‌య్యాయి. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఏం చేయాలో ఐ-ప్యాక్ టీమ్ నిర్దేశించ‌డం, దాన్ని అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించ‌డంతో వైసీపీ ప‌త‌నం ప్రారంభ‌మైంది. రాజ‌కీయాల్లో త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కుల్ని కూడా ఐ-ప్యాక్ టీమ్ ఆడించ‌డం మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు అస‌లు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐ-ప్యాక్ అడుగే పెట్టొద్ద‌ని వార్నింగ్ ఇచ్చిన దాఖ‌లాలు లేక‌పోలేదు.

అంతిమంగా ఐ-ప్యాక్ టీమ్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నివేదిక‌లు ఇవ్వ‌డం, వాటి ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక మొద‌లు, పార్టీలో చేరిక‌ల్ని కూడా జ‌గ‌న్ చేప‌ట్టారు. వైసీపీకి పునాది లాంటి కార్య‌క‌ర్త‌ల్ని, గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కుల్ని విస్మ‌రించి, ప్యాకేజీ కోసం ప‌నిచేసే ఐ-ప్యాక్ టీమ్ జ‌గ‌న్‌కు ముద్దొచ్చింది.

అస‌లు ఐ-ప్యాక్ టీమ్‌కు రాజ‌కీయాలు ఏం తెలుస‌ని వాళ్ల అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌మ‌కు జ‌గ‌న్ ఆదేశాలు ఇస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శించే ప‌రిస్థితి. షూటు, బూటు, రెండు ఇంగ్లీష్ మాట‌లు మాట్లాడితే చాలు, వాళ్ల‌కు రాజ‌కీయాలు బాగా తెలుస‌ని జ‌గ‌న్ పిచ్చి భ్ర‌మ‌లో ఉన్న‌ట్టున్నారు. అందుకే 2024 ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయినా, మ‌ళ్లీ అదే టీమ్‌ను మ‌ళ్లీ నియ‌మించుకున్నారంటే, జ‌గ‌న్‌ను ఏమ‌నుకోవాలి?

ఓట‌మి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకునేవాళ్ల‌ని విజ్ఞులంటారు. 2024 ఎన్నిక‌ల్లో ఐ-ప్యాక్ టీమ్‌, వాలంటీర్ల వ్య‌వ‌స్థ వ‌ల్ల పార్టీ కేడ‌ర్‌ను విస్మ‌రించి రాజ‌కీయంగా ఘోర ప‌రాజ‌యం పాల‌య్యామ‌నే ఆలోచ‌న‌, ఆవేద‌న జ‌గ‌న్‌లో లేదా? అనే అనుమానం క‌లుగుతోంది. వైసీపీ పాలిట ఐ-ప్యాక్ టీమ్ అనేది పార్టీని ప్యాక‌ప్ చేసేదంటూ వైసీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.

ఇప్ప‌టికైనా జ‌గ‌న్ న‌మ్ముకోవాల్సింది పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్నే. ఎందుకంటే క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాల గురించి వాళ్ల‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దు. ప్యాకేజీ కోసం ప‌ని టీమ్‌లు, మెచ్చుకోలు నివేదిక‌లు ఇస్తాయే త‌ప్ప‌, నిజాలు చెప్తాయ‌ని అనుకోవ‌డం అవివేకమే. త‌న శ్రేయ‌స్సును కోరుకునేది , క‌ష్ట‌న‌ష్టాల్లో పార్టీని భుజాన మోసేది కార్య‌క‌ర్త‌లు, నాయకులే. మాన‌సికంగా ద‌గ్గ‌ర‌య్యే వాళ్ల‌ను వ‌దిలేసి, డ‌బ్బు కోసం మాయ మాట‌లు చెప్పే ఐ-ప్యాక్ టీమ్ పీడ‌ను ఇప్ప‌టికైనా విడిపించుకోక‌పోతే, జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే, వైసీపీని ఆ దేవుడే కాపాడాలి.

30 Replies to “ఐ-ప్యాక్‌.. వైసీపీ పాలిట‌ ప్యాక‌ప్ టీమ్‌!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. నిజమే దేవుడే కాపాడాడు ప్రజల్ని వైసీపీ నుండీ… ఇలాంటి నాయకుడు ప్రజలకి ఏవిధంగా అవసరం లేదనే ఛీ ఫో వెధవా అని మొన్న ఎన్నికల లో నిరూపించారు…

  3. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  4. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  5. పాములను పెంచేవాడు.. ఆ పాము కాటుకే పోతాడు..

    జగన్ రెడ్డి కి ఒళ్ళంతా విషమే.. ఇప్పుడు మంచి అనే అమృతం పోసినా.. విషం గానే మారిపోతుంది..

    అందుకే.. జగన్ రెడ్డి కి మంచి చెప్పినా ఎక్కదు..

    ..

    పార్టీ స్థాపించినప్పుడు వెన్నంటి నిలిచిన నాయకులు ఒక్కరు కూడా ఇప్పుడు జగన్ వెనక లేరు..

    ఒక నీచుడిని నాయకుడిగా చేసిన జనాలు.. తప్పు తెలుసుకుని.. ఆ నీచుడిని అదః పాతాళానికి తొక్కేశారు..

    జనాలు తనను మార్పు చెందమని .. ఒక అవకాశం ఇచ్చారని జగన్ రెడ్డి గ్రహించలేకపోయాడు.. తానే జనాలను ఉద్ధరించడానికి అవతరించిన దైవంశ సంభూతుడు అనుకొన్నాడు..

    ..

    జగన్ రెడ్డి పతనం తర్వాతి వందల తరాలకు ఒక గుణపాఠం..

    1. కామెంట్ పెట్టేవాడు కామెంట్ కే పోతాడు అది గుర్తుపెట్టుకో తమ్ముడు

  6. Only because of I-PAC he won in 2019 due to their propaganda. He lost purely because of inefficiency and high headednes…..no reason to blame I-PAC. Atma stuthi paraninda valla prayojanam vundadu…who asked him to confine himself to Tadepalli palace for 5 yrs? Is it i-PAC? Who has asked him to make 3 capitals decision? Who asked him to loot on liqour, said etc.

  7. I PAC లేదు my కరేపాక్ లేదు.. కార్యకర్తలు అసలే అవసరం లేదు

    సొంతంగా 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని నాయకులు అస్సలు అవసరమే లేదు.

    Just నాలుగేళ్లు గట్టిగా కళ్ళుమూసుకుని EVM భజన చేసుకుంటే.. అధికారం తన్నుకుంటూ అదే వస్తది కదా అన్నాయ్??

  8. I PAC లేదు my కరేపాక్ లేదు.. కార్యకర్తలు అసలే అవసరం లేదు

    సొంతంగా 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని నాయకులు అస్సలు అవసరమే లేదు.

    Just నాలుగేళ్లు గట్టిగా కళ్ళుమూసుకుని ‘EVM భజన చేసుకుంటే.. అధికారం తన్నుకుంటూ అదే వస్తది కదా అన్నాయ్??

  9. కంప్యూటర్ సృష్టించింది మనిషే అన్న విషయం గుర్తు పెట్టుకోండి … మనం చెప్పే పని అది చాలా సులువుగా చేస్తుంది అంతేకాని .. అది చెప్తే మనం పనిచెయ్యం ..

    ఐప్యాక్ ఏది చెప్తే అది చేస్తే అన్న బుద్ధి ఏమైనట్టు.. మంచి చెడు ఆలోచించే పరిజ్ఞానం, విచక్షణ మనకి ఉండాలి .. అంతేకాని ఏరు దాటేదాకా ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న తీరులో ఉండకూడదు

  10. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

    1. 99 శాతం హామీలు అమలు చేశాను అని చెప్పిన కూడా .. జనాలు బాబు గారిని నమ్మరు అంటున్నారు మీరు ..

  11. విచక్షణా జ్ఞానం లేనప్పుడు ఇలాంటివే జరుగుతాయి వైనాట్ 175 అన్నవాడు 11 కి వచ్చినా ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించలేడు

  12. నీ భ్రమ కాకపోతే గ్యాస్ ఆంధ్ర మళ్ళీ ఐ ప్యాక్ They are stories of lower level activists and senior leaders, Jagan will never become CM again.

    1. జగన్ కి ఏమాత్రం ఛాన్స్ లేదు. జగన్ మీద గతం లో వున్న ముప్పై కేసుల కి తోడు సరిగ్గా చేస్తే మరో ముప్పై కేసులు పడతాయి. సుప్రీం కోర్ట్ మరెంతో కాలం వెయిట్ చేసే అవకాశం తక్కువ. ఏ సమయంలోనైనా జగన్ జైలు వెళ్లే అవకాశం వుంది. అదే సమయంలో వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , భారతి లకి కూడా జైలు తప్పేట్టు లేదు. వైసీపీ ని నడిపే వారువుండరు. పెద్దలు జగన్ కి రెండే options ఇచ్చారు.

      1 ) . వైసీపీ అధికారికంగా క్లోజ్ చేసి లండన్లో హ్యాపీగా స్థిరపడటమా

      2 ) . జైలు కెళ్ళి వైసీపీ అనధికారికంగా క్లోజ్ చెయ్యటమా .

      పై రెండు విషయాలలోనూ వైసీపీ క్లోజ్ అవ్వటమా మాత్రం కామన్. ఇక మిగిలింది వైసీపీ కార్యాలయాలకి రంగులు మార్చి బీజేపీ బోర్డు లు తగిలియ్యటమే.

  13. IPAc okkadanne nindiste saripotunda🤣🤣. Tila papam tala pidekedu annattu ycp kuppa kuladaaniki ycp lo unna jagan nundi samanya karyakartha varaku andaru Karanam. Vammo aa butulu endi sami🤣🤣

  14. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  15. స్వతహాగా జగన్ కు రాజకీయ పరిజ్ఞానం, వ్యూహాలు, పట్టువిడుపులు ఉండాలి. ఎవడిపైనో గుడ్డిగా ఆధారపడితే నట్టేట మునగడం ఖాయం. ఇలాంటి పిల్ల పిత్రే ప్యాకేజీ గాళ్ళను చంద్రబాబు తన వైపుకు తిప్పుకొని జగన్ను దెబ్బ కొట్టలేడా?

    తనలో రాజకీయ వ్యూహ చతురత లేదు. చుట్టూ చంచా గాళ్ళను చేర్చుకొని, తాను జనాలకు దొరికిన గొప్ప నాయకుడు అనుకొంటూ అభివృద్ధి అనేదే లేకుండా జనాలకు నెలనెలా ఠంచనుగా డబ్బులు పంచుకొంటూ పోతూ తనే శాశ్వతంగా గెలుస్తానని భ్రమల్లో బతికాడు. బొక్క బోర్లా పడ్డాడు. కానీ ఇప్పటికీ స్వీయ సమీక్ష లేదు.

  16. మరి మన గజినీ తో అంట కాగితే అంట్ల వెధవలా మారపోతాడు.. ఇంకా ఉంటే శాశ్వత చిప్పకూడు పథకం కింద లబ్ది దారుడు అవుతాడు.. అందుకే ఇంటిదగ్గర వ్యవసాయం చేసుకుని ఇంటి భోజనం తింటాడట సాంబా

Comments are closed.