జ‌గ‌న్ చుట్టూ నోరున్నోళ్లే.. బుర్ర ఉన్నోళ్లేరి?

త‌న చుట్టూ బ‌ల‌హీనులు వుంటేనే త‌ను బ‌లంగా ఉంటాన‌ని జ‌గ‌న్ న‌మ్ముతారు. అందుకే నోరున్న వాళ్లు త‌ప్ప‌, బుర్ర ఉన్న‌ వాళ్ల‌ని ద‌గ్గ‌ర పెట్టుకోడు.

తండ్రి నుంచి జ‌గ‌న్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని తీసుకున్నాడు. కానీ మాన‌సిక వార‌స‌త్వం తీసుకోలేక‌పోయాడు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిది అంద‌రినీ ద‌గ్గ‌రికి తీసుకునే త‌త్వం. జ‌గ‌న్‌ది దూరం చేసుకునే మ‌న‌స్త‌త్వం. వైఎస్ చుట్టూ కూడా కోట‌రీ వుండేది కానీ, అది ఆయ‌న్ని జ‌నానికి దూరం చేయ‌లేదు. జ‌గ‌న్‌ని కోట‌రీనే నాశ‌నం చేసింది, చేస్తూ వుంది. ఈ మాట విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌క్క‌ర్లేదు. దూరం నుంచి చూసేవాళ్ల‌కి కూడా క‌నిపిస్తుంది.

విజ‌య‌సాయిరెడ్డి ఎవ‌రు? వైఎస్ కుటుంబానికి విధేయుడు. వ్య‌క్తిగ‌త ఆడిట‌ర్‌. జ‌గ‌న్‌తో పాటు జైలుకు వెళ్లిన వ్య‌క్తి. జ‌గ‌న్ వ్యాపార ర‌హ‌స్యాలు తెలిసిన మ‌నిషి. ఢిల్లీలో లాబీయింగ్ చేసిన రాజ్య‌స‌భ స‌భ్యుడు. అత‌నే జ‌గ‌న్‌కి దండం పెట్టి వెళ్లిపోయారు.

జ‌గ‌న్ దూరం పెట్టిన వాళ్లు, జ‌గ‌న్‌కి దూర‌మైన వాళ్ల సంఖ్య త‌క్కువేం కాదు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి సౌమ్యుడు, వివాద ర‌హితుడు. పార్టీని వ‌దిలి టీడీపీలో ప్ర‌శాంతంగా ప‌ద‌వుల్లో ఉన్నారు. మాగుంట వెళ్లిపోయారు. చివ‌రికి బంధువు బాలినేని కూడా. వివాద ర‌హితుడు కృష్ణ‌దేవ‌రాయ‌ల్ని పార్టీ నుంచి పంపి, నోటి దురుసు అనిల్‌ని పోటీ చేయించారు. అనిల్‌కి, ప‌ల్నాడుకి ఏంటి సంబంధం?

రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కూడా పార్టీ మారిన వాళ్లున్నారు. వాళ్లెవ‌రూ వైఎస్‌ని ప‌ల్లెత్తు మాట అన‌లేదు. వైఎస్ కూడా త‌నకి దూర‌మైన వాళ్ల‌ని శ‌త్రువులుగా చూసేవాళ్లు కాదు. ఎలాగోలా క‌లుపుకుని పోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసేవాళ్లు.

జ‌గ‌న్‌కి ప‌ట్టువిడుపులు తెలియ‌వు. అదే త‌న బ‌ల‌మ‌నే భ్ర‌మ‌లో ఉన్నాడు. త‌న చుట్టూ బ‌ల‌వంతులు వుంటే తాను ఇంకా బ‌ల‌ప‌డ‌తాన‌నే న‌మ్మ‌కం వైఎస్‌ది. కేవీపీ, ఉండ‌వ‌ల్లి, బొత్స, గ‌ల్లా అరుణ‌, పొన్నాల‌, ధ‌ర్మాన‌, సబిత ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. వీళ్లంతా మాట‌తీరు, ప‌రిజ్ఞానంతో కాపు కాసేవాళ్లు.

త‌న చుట్టూ బ‌ల‌హీనులు వుంటేనే త‌ను బ‌లంగా ఉంటాన‌ని జ‌గ‌న్ న‌మ్ముతారు. అందుకే నోరున్న వాళ్లు త‌ప్ప‌, బుర్ర ఉన్న‌ వాళ్ల‌ని ద‌గ్గ‌ర పెట్టుకోడు. ఆయ‌న హ‌యాంలో మంత్రులంతా డ‌మ్మీలే. అయినా ప్ర‌భుత్వ విధానాల గురించి స‌ల‌హాదారుడు మాట్లాడ్డం ఇన్నేళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎప్పుడైనా చూశామా? విన్నామా? అదే జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త‌.

తండ్రి నుంచి ప్ర‌జ‌ల అభిమానాలు అనే డిపాజిట్‌ని జ‌గ‌న్ పొందాడు. 15 ఏళ్ల‌లో డిపాజిట్ మొత్తం డ్రా చేసుకుని వాడేశాడు. అకౌంట్ ఖాళీ. ఇక చేయాల్సింది సొంత యుద్ధ‌మే. త‌ల్లి, చెల్లిని కూడా ప్ర‌త్య‌ర్థులుగా మార్చుకున్న వైఎస్ కుమారుడు జ‌గ‌న్‌, ఆల్రెడీ త‌న పాల‌న ఫ‌లితాల్ని చూశాడు. నీళ్ల‌లో మునిగేవాళ్ల‌ని ర‌క్షించ‌డం రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌త్యేక‌త‌. అయితే తాను నీళ్ల‌లో వుండి, అంద‌ర్నీ లాగ‌డం జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త‌. చంద్ర‌బాబు త‌ప్పిదాలే త‌న‌ని గెలిపిస్తాయ‌ని న‌మ్ముతున్నాడు కానీ, త‌న త‌ప్పిదాల్ని గుర్తించే స్థితిలో లేడు. ప‌లావ్‌, బిర్యానీ సిద్ధాంతాన్ని న‌మ్ముతున్నాడు. అవేమీ అపురూప వంట‌కాలు కాదు. ప్ర‌తివీధి చివ‌ర దొరుకుతాయ‌ని జ‌గ‌న్‌కి తెలియ‌దు. ఎందుకంటే ఆయ‌న జ‌నం మ‌ధ్య‌కి రాక చాలా కాల‌మైంది.

అసెంబ్లీకి వెళ్లి, క్రియాశీల‌క ప్ర‌తిప‌క్షంగా జ‌నంలో వుంటూ వాళ్ల అభిమానాన్ని గెలుచుకోవాల‌ని కానీ, చంద్ర‌బాబు బ్యాట్ తిప్ప‌లేక ఔట్ అయితే మైదానంలోకి వెళ్లాల‌ని అనుకోవ‌డం జ‌గ‌న్ భ్ర‌మ‌. అయినా జ‌గ‌న్‌కి తెలియంది ఏమంటే ఈ సారి బాబు ఆట మార్చాడు. అది క్రికెట్ కాదు, బేస్‌బాల్. చూడ్డానికి ఒకేలా ఉన్నా, నియ‌మాలు వేరు. న‌మ్మిన వాళ్ల‌ని దూరం చేసుకునే వాళ్లు, అధికారానికి కూడా దూర‌మ‌వుతారు. అయినా జ‌గ‌న్‌కి ఇవ‌న్నీ వినిపించాలంటే కోట‌రీని దాటుకుని వెళ్లాలి. జ‌గ‌న్ చుట్టూ సౌండ్ ప్రూప్ బిగించేశారు. ఆయ‌న అధికారంలోకి రావాల‌నే కోరిక వాళ్లెవ‌రికీ లేదు. జ‌గ‌న్‌కి కూడా ఉన్న‌ట్టు లేదు.

అయినా చంద్ర‌బాబుకి అన్నీ క‌లిసి వ‌స్తున్నాయి. జ‌గ‌న్‌కి అనుకూల శ‌త్రువులు ఉన్నంత కాలం హెరిటేజ్ చ‌ల్ల‌టి మ‌జ్జిగ తాగి చంద్ర‌బాబు కూల్‌గా వుండొచ్చు.

69 Replies to “జ‌గ‌న్ చుట్టూ నోరున్నోళ్లే.. బుర్ర ఉన్నోళ్లేరి?”

  1. Super article. I strongly support this. Whatever I am thinking about Jagan, same resembled here.

    Please take all this articles to the notice of Jagan. He is spoiling his bright future with his own hands. He should keep good advisors.

  2. ఈ ముక్కే నేను గత నాలుగేళ్లుగా చెపుతూనే ఉన్నా..

    మా మామయ్యగారు 2019 లో వైసీపీ ఎమ్మెల్యే..

    2004 లోనే కాంగ్రెస్ తరపున గెలిచి.. 2010 లో జగన్ రెడ్డి కోసం కాంగ్రెస్ వదిలేసి.. జగన్ రెడ్డి కోసం ఆస్తులు కూడా అమ్ముకొన్నాడు..

    అప్పట్లోనే 40 కోట్లు వైసీపీ కోసం ధారాదత్తం చేసుకొన్నాడు..

    ..

    2014 లో ఓడిపోయారు .. 2019 లో వైసీపీ తరపున గెలిచాడు .. ఐదేళ్లలో జగన్ రెడ్డి ని రెండే రెండు సార్లు కలిసాడు..

    నియోజకవర్గం లో ఇబ్బందులున్నాయని సీఎంఓ లో చెపితే.. రెండు నెలల తర్వాత అప్పోయింట్మెంట్ ఇచ్చారు..

    ఆ రోజు పొద్దున్న 8 కి వెళితే సాయంత్రం 9 కి .. ఈ రోజు కుదరదు.. అని ఇంకో అప్పోయింట్మెంట్ 3 నెలల తర్వాత ఇచ్చారు..

    3 నెలల తర్వాత వెళితే.. 40 మంది ఎమ్మెల్యే లతో కలిసి కూర్చుని .. వాడు చెప్పేది చెప్పేసి వెళ్ళిపోయాడట ..

    మా మామయ్యగారు వచ్చిన విషయం కూడా జగన్ రెడ్డి కి తెలీదు.. ఈ మాత్రం దానికి అప్పోయింట్మెంట్ ఎందుకు..?

    ఇదేనా పార్టీ నడిపే విధానం..? ఇదేనా నాయకత్వం..?

    ..

    అందరూ అంటుంటారు.. టీడీపీ నాయకులను జగన్ రెడ్డి ఇబ్బందులు పెడుతుంటాడు అని..

    వైసీపీ నాయకులు పడ్డ ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేరు..

    ..

    జగన్ రెడ్డి ఒక నీచుడు.. మనిషి రూపం లో ఉన్న రాక్షసుడు..

    వాడికి అధికారం ఒక అలంకారం మాత్రమే.. కేసుల నుండి రక్షించుకోడానికి ఒక అవసరం మాత్రమే..

    1. నాకు తెలిసిన YS ఫామిలీ మిత్రుడు కుమారుడు చెప్పిందేమిటంటే, జగన్ ఒక కీలుబొమ్మ , భారతి గారు YS రాజశేఖర్ గారి ఫామిలీ వైపు వున్న లింక్ లు అన్నింటినీ తెంపేస్తుంది అన్నాడు.

          1. Ayyo mastaru , 1 1 lopala vunte cm post yevariki vastundi .

            Elagu 1 1 ki 2029 lo kakapothe 2034 lo aithe vastundi chance

            40 percent vote share with this much arrogance ante happy ga vundachu

          2. వచ్చే ఎన్నికల్లో ఆ నలభై శాతం కాస్త ముఫై శాతం అవుతుంది అన్నయ్య లో మార్పు రాకపోతే

    2. Papam mla ki ee paristhiti ante , temple chairman ki Elanti welcome dorikindo expect cheyandi.

      2019 elections notification ki mundu velli cbn ni kalsi work adigithe ok chepparu , ysrcp party aina.cs orders pass ayye time ki election code vachindi works went to halt.

      Mana 1 1 gave promise during yatra. Elect ayyaka appointment adigithe 5 years lo 5 times tipparu , morning 8.00 ki palace lo meeting, security won’t allow inside till 8.30

      Then u have to run inside palace, aina kani 1 1 appointment time aipoyindi antaru.

      Ela chese 1 5 1 nundi 1 1. Ee sari papam temple ki vachina variki kuda 1 1 ki vote vesthe …manaki chippa ani chepparu. 2025 lo malli cbn deggariki velithe , welcome was good , nenu 2019 lo approve chesa project enka ade stage lo vundatam bada ga vundi ani without us saying any word gave approval letter for works

    3. మీ మామయ్య గారు మాత్రమే కాదు, అలా కొన్ని లక్షల మంది ఉన్నారు, అందుకే పులికేశి గాడు భూస్దాపితం అయిపోయాడు

  3. మావోడు ఫీజు పోరు హడావిడిలో, నీ ఫీజు paytm చెయ్యడం మర్చిపోయుంటాడు.. నేను రిమైండ్ చేస్తాలే.. రేపటికి credit ఆవుతుంది కానీ

    ‘ఎంరో గ్యాసు ఆంధ్రా

    మావోడి సై’కో ‘సైకాలజీ, ‘శాడిస్ట్ మె0టాలిటీని క్రిస్టల్ క్లియర్ గా ఎక్సపోజ్ చేసావ్..just ఒక నెల ఫీజు లేట్ అయ్యిందని, ఇలా మావాడి ట్రూ ఆటిట్యూడ్ ని అందరికీ టామ్ టామ్ చెయ్యడం భావ్యమా ‘చెప్పు??

    ఇలా అయితే 2029 లో కాదు కదా, 2039 లో కూడా జనాలు మనోణ్ణి నమ్మి ఓట్లేసి గెలిపించరు.. ఏం చేద్దాం చెప్పు??

    బానిస బతుకా ‘లేక బ్లాక్మెయిల్ చేసి బాత్రూ0 కెళ్తావా??

    ఛాయస్ is yours..

    1. True. Maybe this is his actual attitude and nature. He was successful at hiding it and fooling people in 2019. Now that his true nature is revealed, no one will believe him.

  4. ఏమ్మా నిన్ను నువ్వు బుర్ర ఉన్నట్టు లెక్కేసుకోలేదా ??? లేకపోతె అన్న ని వదిలేస్తున్నారు అని హింట్ ఇస్తున్నారా ???

  5. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను

    సజ్జనుండు బల్కు చల్లగాను

    కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా

    విశ్వ దాభిరామ..! వినుర వేమ…!

    తాత్పర్యం :

    అల్పబుద్ధి కలిగినవాడు ఎప్పుడూ.. డాంబికాలు పోతూ, ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు. అదే శాంత స్వభావి మాత్రం సున్నితంగా మాట్లాడుతాడు, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. కంచు శబ్దం చేసినట్లుగా, బంగారం శబ్దం చేయదు కదా..! అలాగే అల్బబుద్ధి కలిగినవాడిని కంచుతోనూ, శాంత స్వభావిని బంగారంతో పోల్చాడు ఈ పద్యంలో వేమన మహాకవి.

    1. పైన పద్యం అసలు మాట్లాడడమే చేతకాని వాళ్ళకి నప్పదు లెండి రెడ్డి గారు ..

    2. “అల్పబుద్ధి కలవానికాధికారమిచ్చిన

      దొడ్డవారినెల్ల దొలగజేయు

      చెప్పుదినెడి కుక్క చెరుకు తీపెఱుగునా

      విశ్వదాభిరామ వినురవేమ “

      ఊ: 2014 -2024 తుగ్లుక్ పరిపాలన..

    3. “అల్పబుద్ధి కలవానికాధికారమిచ్చిన

      దొడ్డవారినెల్ల దొలగజేయు

      చెప్పుదినెడి కుక్క చెరుకు తీపెఱుగునా

      విశ్వదాభిరామ వినురవేమ “

      ఊ: 2014 -2024 జగ్గు పరిపాలన..

  6. Well said GA after a long time.

    All the former MPs/Ministers have only bad tongue. No brains.

    Even Ambati as Irrigation Minister openly said that he does not understand about Polavaram Project at all.

    Roja/Kodali/Anil all are disasters.

    Even experienced Botsa tumbled by dubbing Amaravathi as Burial ground.

  7. జగన్. కు ఏదో అధికారం పోతుంది అని బాధ తప్ప పాలన లో ఏమి చేశాడు ఎంత నాశనం చేశాడు ఒక్క సారి రాస్తే బెటర్ . సర్వ నాశనం అయింది స్టేట్ . ఒక్క ఫీజు బకాయిలు 4 వేల కోట్లు దాటి. ఈ కొత్త గా వచ్చినోళ్ళు ఆ ఫీజు లు ఇవ్వలేరు. అల్లా అని. పథకాలు థీసెయ్య లేరు. ఇలా ప్రతి వ్యవస్థ అతలాకుతలం

  8. నేను ఇవే మాటలు 2012/2013 నుండి చెపుతునే ఉన్న ఈ రోజు వరకు. కావాలంటే నా కామెంట్స్ చెక్ చేసుకోండి గ్రేట్ ఆంధ్ర లో Raja Pavan , Pavan , Pavan అనే పేరు తో కామెంట్స్ ఉంటాయి..

    వైసీపీ కి దేనికి ఓటు వేయాలి… జగన్ వైస్సార్ కొడుకు అనే ట్యాగ్ లేకుండా, వైస్సార్ చనిపోయిన సానుభూతి కాకుండా, వైస్సార్ పెరు పార్టీ పేరు లో లేకుంటే (పార్టీ ని కూడా ఇంకొక్కరి నుండి తీసుకున్నాడు), ఇవి కాకుండా జగన్ అంటే ఏంటి. ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేశాడా.. లేకుంటే తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు లాగా తెలంగాణ కోసం కేసీఆర్ లాగా ఉద్యమాలు చేశాడా… పోనీ ప్రత్యేక హోదా సాదించడా ఏమైనా కొత్త రాజధాని కట్టినాడా.. ప్రకాశం నుండి శ్రీకాకుళం వరకు రెడ్డి ప్రాబల్యం తక్కువ. వేరే కులాల వాళ్ళు రెడ్డి కుల ప్రాంతీయ వారసత్వ పార్టీ వైసీపీ కి ఎందుకు ఓటు వేయాలి… నువ్వు టీడీపీ గురుంచి ఆడగవచ్చు, అది తెలుగు వాళ్లకు వాళ్ళ ఆత్మగౌరవం కోసం సెపరేట్ పార్టీ ఉండాలి అని, అప్పటి సినీ పాపురిటీ ఆసరా తో, పటేల్ పట్వారీ, కరణం వ్యవస్థ లకు వ్యతిరేకంగా, పితృస్వామ్య దేశంలో , రాష్ట్రాల్లో అడబిడ్డలకు ఆస్తి హక్కు, బీసీ లకు రాజకీయ ప్రాధన్యం లాంటి ఎన్నో కారణాలతో టీడీపీ కి సంస్థాగత కార్యకర్తలు ఉన్నారు అయునప్పటికి టీడీపీ కి మునుపటి పట్టు లేదు. నేను కు ల ప్రాతిపదిక వారసత్వ ప్రాంతీయ పార్టీ లకు వ్యతిరేకం.. మేము ఇంత చేసాము అని చెప్పుకుంటున్న వైసీపీ ని, వైసీపీకి కృత్రిమంగా వచ్చిన పాలపొంగు ఎలా కరిగిపోయుందో మొన్నటి ఎన్నికల్లో చూశావ్… రాష్ట్రంలో 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు కనీసం పోటీ లేక వైసీపీ అధికారహయం లో రాయలసీమ తో సహా 3 ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయారు. నిన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేక పారిపోయారు.. అర్థం అవ్వలేదా చదువుకున్న వాళ్ళు ఎవరు జగన్ కి సపోర్ట్ చేయట్లేదు అని… ఇవి మీరు ఎపుడు నిందించే evm ఎన్నికలు కాదు బ్యాలెట్ తో జరిగాయి.. 😂😂 పోను పోను 39.4% వైసిపి కి ఓటు వేసిన వాళ్ళు కూడా జగన్ గురుంచి తెలుసుకుంటారు .

  9. నేను ఇవే మాటలు 2012/2013 నుండి చెపుతునే ఉన్న ఈ రోజు వరకు. కావాలంటే నా కామెంట్స్ చెక్ చేసుకోండి గ్రేట్ ఆంధ్ర లో Raja Pavan , Pavan , Pavan అనే పేరు తో కామెంట్స్ ఉంటాయి..

    వైసీపీ కి దేనికి ఓటు వేయాలి… జగన్ వైస్సార్ కొడుకు అనే ట్యాగ్ లేకుండా, వైస్సార్ చనిపోయిన సానుభూతి కాకుండా, వైస్సార్ పెరు పార్టీ పేరు లో లేకుంటే (పార్టీ ని కూడా ఇంకొక్కరి నుండి తీసుకున్నాడు), ఇవి కాకుండా జగన్ అంటే ఏంటి. ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేశాడా.. లేకుంటే తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు లాగా తెలంగాణ కోసం కేసీఆర్ లాగా ఉద్యమాలు చేశాడా… పోనీ ప్రత్యేక హోదా సాదించడా ఏమైనా కొత్త రాజధాని కట్టినాడా.. ప్రకాశం నుండి శ్రీకాకుళం వరకు రెడ్డి ప్రాబల్యం తక్కువ (వైస్సార్ ఫ్యామిలీ రె డ్డి కాదు). వేరే కులాల వాళ్ళు రెడ్డి కు ల ప్రాంతీయ వారసత్వ పార్టీ వైసీపీ కి ఎందుకు ఓటు వేయాలి…

  10. నేను ఇవే మాటలు 2012/2013 నుండి చెపుతునే ఉన్న ఈ రోజు వరకు. కావాలంటే నా కామెంట్స్ చెక్ చేసుకోండి గ్రేట్ ఆంధ్ర లో Raja Pavan , Pavan , Pavan అనే పేరు తో కామెంట్స్ ఉంటాయి.. నా id లు చాలా బ్లా క్ చేశారు నేను వేరే వేరే e ma il id లతో నా పేరు కంటిన్యూ చేస్తున్న..

    వైసీపీ కి దేనికి ఓటు వేయాలి… జగన్ వైస్సార్ కొడుకు అనే ట్యాగ్ లేకుండా, వైస్సార్ చనిపోయిన సానుభూతి కాకుండా, వైస్సార్ పెరు పార్టీ పేరు లో లేకుంటే (పార్టీ ని కూడా ఇంకొక్కరి నుండి తీసుకున్నాడు), ఇవి కాకుండా జగన్ అంటే ఏంటి. ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేశాడా.. లేకుంటే తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు లాగా తెలంగాణ కోసం కేసీఆర్ లాగా ఉద్యమాలు చేశాడా… పోనీ ప్రత్యేక హోదా సాదించడా ఏమైనా కొత్త రాజధాని కట్టినాడా.. ప్రకాశం నుండి శ్రీకాకుళం వరకు రెడ్డి ప్రాబల్యం తక్కువ (వైస్సార్ ఫ్యామిలీ రె డ్డి కాదు). వేరే కు లాల వాళ్ళు రె డ్డి కు ల ప్రాంతీయ వారసత్వ పార్టీ వైసీపీ కి ఎందుకు ఓటు వేయాలి…నువ్వు టీడీపీ గురుంచి ఆడగవచ్చు, అది తెలుగు వాళ్లకు వాళ్ళ ఆత్మగౌరవం కోసం సెపరేట్ పార్టీ ఉండాలి అని, అప్పటి సినీ పాపురిటీ ఆసరా తో, పటేల్ పట్వారీ, కరణం వ్యవస్థ లకు వ్యతిరేకంగా, పితృస్వామ్య దేశంలో , రాష్ట్రాల్లో అడబిడ్డలకు ఆస్తి హక్కు, బీసీ లకు రాజకీయ ప్రాధన్యం లాంటి ఎన్నో కారణాలతో టీడీపీ కి సంస్థాగత కార్యకర్తలు ఉన్నారు అయునప్పటికి టీడీపీ కి మునుపటి పట్టు లేదు. నేను కు ల ప్రాతిపదిక వారసత్వ ప్రాంతీయ పార్టీ లకు వ్యతిరేకం.. మేము ఇంత చేసాము అని చెప్పుకుంటున్న వైసీపీ ని, వైసీపీకి కృత్రిమంగా వచ్చిన పాలపొంగు ఎలా కరిగిపోయుందో మొన్నటి ఎన్నికల్లో చూశావ్… రాష్ట్రంలో 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు కనీసం పోటీ లేక వైసీపీ అధికారహయం లో రాయలసీమ తో సహా 3 ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయారు. నిన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేక పారిపోయారు.. అర్థం అవ్వలేదా చదువుకున్న వాళ్ళు ఎవరు జగన్ కి సపోర్ట్ చేయట్లేదు అని… ఇవి మీరు ఎపుడు నిందించే evm ఎన్నికలు కాదు బ్యాలెట్ తో జరిగాయి.. 😂😂 పోను పోను 39.4% వైసిపి కి ఓటు వేసిన వాళ్ళు కూడా జగన్ గురుంచి తెలుసుకుంటారు .

  11. నేను ఇవే మాటలు 2012/2013 నుండి చెపుతునే ఉన్న ఈ రోజు వరకు. కావాలంటే నా కామెంట్స్ చెక్ చేసుకోండి గ్రేట్ ఆంధ్ర లో Raja Pavan , Pavan , Pavan అనే పేరు తో కామెంట్స్ ఉంటాయి.. నా id లు చాలా బ్లాక్ చేశారు నేను వేరే వేరే email id లతో నా పేరు కంటిన్యూ చేస్తున్న..

    వైసీపీ కి దేనికి ఓటు వేయాలి… జగన్ వైస్సార్ కొడుకు అనే ట్యాగ్ లేకుండా, వైస్సార్ చనిపోయిన సానుభూతి కాకుండా, వైస్సార్ పెరు పార్టీ పేరు లో లేకుంటే (పార్టీ ని కూడా ఇంకొక్కరి నుండి తీసుకున్నాడు), ఇవి కాకుండా జగన్ అంటే ఏంటి. ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేశాడా.. లేకుంటే తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు లాగా తెలంగాణ కోసం కేసీఆర్ లాగా ఉద్యమాలు చేశాడా… పోనీ ప్రత్యేక హోదా సాదించడా ఏమైనా కొత్త రాజధాని కట్టినాడా.. ప్రకాశం నుండి శ్రీకాకుళం వరకు రెడ్డి ప్రాబల్యం తక్కువ (వైస్సార్ ఫ్యామిలీ రె డ్డి కాదు). వేరే కులాల వాళ్ళు రెడ్డి కు ల ప్రాంతీయ వారసత్వ పార్టీ వైసీపీ కి ఎందుకు ఓటు వేయాలి…

  12. నేను ఇవే మాటలు 2012/2013 నుండి చెపుతునే ఉన్న ఈ రోజు వరకు. కావాలంటే నా కామెంట్స్ చెక్ చేసుకోండి గ్రేట్ ఆంధ్ర లో Raja Pavan , Pavan , Pavan అనే పేరు తో కామెంట్స్ ఉంటాయి..

    వైసీపీ కి దేనికి ఓటు వేయాలి… జగన్ వైస్సార్ కొడుకు అనే ట్యాగ్ లేకుండా, వైస్సార్ చనిపోయిన సానుభూతి కాకుండా, వైస్సార్ పెరు పార్టీ పేరు లో లేకుంటే (పార్టీ ని కూడా ఇంకొక్కరి నుండి తీసుకున్నాడు), ఇవి కాకుండా జగన్ అంటే ఏంటి. ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేశాడా.. లేకుంటే తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు లాగా తెలంగాణ కోసం కేసీఆర్ లాగా ఉద్యమాలు చేశాడా… పోనీ ప్రత్యేక హోదా సాదించడా ఏమైనా కొత్త రాజధాని కట్టినాడా.. ప్రకాశం నుండి శ్రీకాకుళం వరకు రె డ్డి ప్రాబల్యం తక్కువ. 

  13. నేను ఇవే మాటలు 2012/2013 నుండి చెపుతునే ఉన్న ఈ రోజు వరకు. కావాలంటే నా కామెంట్స్ చెక్ చేసుకోండి గ్రేట్ ఆంధ్ర లో Raja Pavan , Pavan , Pavan అనే పేరు తో కామెంట్స్ ఉంటాయి..

    వైసీపీ కి దేనికి ఓటు వేయాలి… జగన్ వైస్సార్ కొడుకు అనే ట్యాగ్ లేకుండా, వైస్సార్ చనిపోయిన సానుభూతి కాకుండా, వైస్సార్ పెరు పార్టీ పేరు లో లేకుంటే (పార్టీ ని కూడా ఇంకొక్కరి నుండి తీసుకున్నాడు), ఇవి కాకుండా జగన్ అంటే ఏంటి. ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేశాడా.. లేకుంటే తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు లాగా తెలంగాణ కోసం కేసీఆర్ లాగా ఉద్యమాలు చేశాడా… పోనీ ప్రత్యేక హోదా సాదించడా ఏమైనా కొత్త రాజధాని కట్టినాడా.. ప్రకాశం నుండి శ్రీకాకుళం వరకు రె డ్డి ప్రాబల్యం తక్కువ. వేరే కు లా ల వాళ్ళు రె డ్డి కుల ప్రాంతీయ వారసత్వ పార్టీ వైసీపీ కి ఎందుకు ఓటు వేయాలి… నువ్వు టీడీపీ గురుంచి ఆడగవచ్చు, 

  14. మీరు టీ డీ పీ గురుంచి ఆడగవచ్చు, అది తెలుగు వాళ్లకు వాళ్ళ ఆత్మగౌరవం కోసం సెపరేట్ పార్టీ ఉండాలి అని, అప్పటి సినీ పాపురిటీ ఆసరా తో, పటేల్ పట్వారీ, కరణం వ్యవస్థ లకు వ్యతిరేకంగా, పితృస్వామ్య దేశంలో , రాష్ట్రాల్లో అడబిడ్డలకు ఆస్తి హక్కు, బీసీ లకు రాజకీయ ప్రాధన్యం లాంటి ఎన్నో కారణాలతో టీడీపీ కి సంస్థాగత కార్యకర్తలు ఉన్నారు అయునప్పటికి టీడీపీ కి మునుపటి పట్టు లేదు. నేను కు ల ప్రాతిపదిక వారసత్వ ప్రాంతీయ పార్టీ లకు వ్యతిరేకం.. మేము ఇంత చేసాము అని చెప్పుకుంటున్న వైసీపీ ని, వైసీపీకి కృత్రిమంగా వచ్చిన పాలపొంగు ఎలా కరిగిపోయుందో మొన్నటి ఎన్నికల్లో చూశావ్… రాష్ట్రంలో 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు కనీసం పోటీ లేక వైసీపీ అధికారహయం లో రాయలసీమ తో సహా 3 ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయారు. నిన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేక పారిపోయారు.. అర్థం అవ్వలేదా చదువుకున్న వాళ్ళు ఎవరు జగన్ కి సపోర్ట్ చేయట్లేదు అని… ఇవి మీరు ఎపుడు నిందించే evm ఎన్నికలు కాదు బ్యాలెట్ తో జరిగాయి.. 😂😂 పోను పోను 39.4% వైసిపి కి ఓటు వేసిన వాళ్ళు కూడా జగన్

  15. ఏరా గొర్రె బిడ్డ జగన్ , పిల్లలకి ప్రజల డబ్బుతో పంచిన్ డిక్షనరీ లో దేముడు అంటే కేవలం గొర్రెలు దేముడు అని మాత్రమే చెబుతావా, నువ్వు అప్పట్లో నీ ఇంటో వేసిన తిరుమల గుడి దేముడు దేముడు కాద రా కుయ్య గా !

  16. ఈ కొత్తి*మీర కట్ట గాడి కి , ఇంట్లో ప*నోడికి వున్న విలువ కూడా లేదు అంటున్నారు, దగ్గరి వాళ్ళు. అన్నం కూడా ఏదో కు*క్క పడే*సినట్లి అక్కడ టేబుల్ మీద పెడితే వెళ్లి లటుక్కున తినేసి తన గది లో కి వెళ్ళి డాక్కుంటాడు అంటారు, మరే అంత బి*ప్పం గాడా.

  17. మన GA సర్ కి పేమెంట్ పడనట్టు గ వుంది ఇలాంటి ఆర్టికల్స్ వదలటం ఏమిటి ఇన్ని రోజులు పేమెంట్ సరిగ్గానే వచ్చింది కదా ఒక పేమెంట్ లేట్ అయితే ఇలాగ రాసేయడమేనా

  18. పక్కన బుర్ర వున్న వాళ్ళని పెట్టుకుంటే తనకి బుర్ర లేదు అని కనిపెట్టేస్తారు అని వాడి ప్లాన్ . అందుకే తన చుట్టూ తన లాంటి బుర్ర లేని ముఠా నీ పెట్టుకుంటాడు.

  19. చుట్టూ బు*ర్ర వున్న వాళ్ళని పెట్టుకుంటే, వాడికి బు*ర్ర లేదు ఆన్న విషయం వాళ్ళకి తెలిస్పాయిపోతుంది అని వాడి ఫీలింగ్.

  20. అర్ధమయ్యింది రా రాజా! నీ మాటలో ఓ తడాఖా ఉంది. సమయం ఉన్నప్పుడే పనిచేయాలి, అప్పుడు

    మాట్లాడాలి, అప్పుడే ప్రభావం చూపించగలం. లేదంటే, పిన్ని ముద్ద పెట్టేలోపే పిల్లోడు ఏడ్చి ఆపినట్టు అవుతుంది!

    ఈలాంటి వ్యాసాలు ఇప్పుడు రాయడం కాదు, అధికారంలో ఉన్నప్పుడే రాయాలి. అప్పుడే 30 సంవత్సరాలుగా మనమే అన్న సంక్షేమాలను గెలిపించుకుంటాం. బాబు ముసలోడు అన్నావు!

  21. “జ‌గ‌న్‌కి అనుకూల శ‌త్రువులు ఉన్నంత కాలం హెరిటేజ్ చ‌ల్ల‌టి మ‌జ్జిగ తాగి చంద్ర‌బాబు కూల్‌గా వుండొచ్చు”…. what will jagan do? loot andhra and tarnsfer to london…

  22. వైయస్ఆ*ర్ నీ తన వా*రసత్వ పద*వి అవ*కాశం కోసం కు*ట్ర చేసి చం*పిన కో*డి క*త్తి ప్యాల*స్ పుల*కేశి మీ*ద సీబీ*ఐ విచా*రణ చేయాలె.

Comments are closed.