బండారు లేనప్పుడు అతడి ఇంట్లో ఏం జరుగుతోంది?

వైసీపీ నేత రోజాపై బండారు చేసిన అభ్యంతరక వ్యాఖ్యలపై ఇప్పటికే ఖుష్బూ విరుచుకుపడ్డారు. రోజాకు పూర్తి మద్దతు తెలిపారు. ఇప్పుడు రాధిక కూడా రోజా కోసం ముందుకొచ్చారు. కేవలం మద్దతు తెలపడమే కాకుండా.. బండారుపై…

వైసీపీ నేత రోజాపై బండారు చేసిన అభ్యంతరక వ్యాఖ్యలపై ఇప్పటికే ఖుష్బూ విరుచుకుపడ్డారు. రోజాకు పూర్తి మద్దతు తెలిపారు. ఇప్పుడు రాధిక కూడా రోజా కోసం ముందుకొచ్చారు. కేవలం మద్దతు తెలపడమే కాకుండా.. బండారుపై విరుచుకుపడ్డారు. “నీ ఇంట్లో ఏం జరుగుతోందో నీకు తెలుసా?” అంటూ బండారును ప్రశ్నించారు రాధిక.

“పొద్దున్న లేచి మీరు పని మీద బయటకు వెళ్తున్నారు కదా? రాజకీయాలు చేస్తున్నారు, సమావేశాలకు వెళ్తున్నారు. మరి మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ వెనక ఏం జరుగుతోందో మీకు తెలుసా? మేం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలం. మీ స్థాయిపై మా అందరికీ ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి కామెంట్స్ చేసి, ఓ మహిళను హింసించి, ఏం సాధిస్తారు? సమాజంలో మీకు గౌరవం దక్కుతుందా? మీ వల్ల మీ పార్టీపై కూడా అసహ్యం వేస్తోంది.”

ఇలా బండారు చేసిన వ్యాఖ్యల్ని పూర్తిస్థాయిలో ఖండించారు రాధిక. మహిళా బిల్లును ఆమోదించిన వేళ, భారతదేశం అభివృద్ధిలో మహిళలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో.. ఓ మహిళపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

“ఒక ఆడదాన్ని కించపరచాలంటే ఇదొక్కటే మార్గమా. మహిళను వ్యభిచారిగా చూపించడం లేదా నీలిచిత్రాల్లో నటించిందని ఆరోపించడమేనా? ఏంటి ఆ మాటలు? ఆ వ్యాఖ్యలు చూసి మేం భయపడతాం లేదా మహిళలంతా భయపడతారని మీరు అనుకుంటే, మీరు చాలా పెద్ద తప్పు చేసినట్టే. ఏ మహిళా ఇలాంటి కామెంట్స్ కు భయపడదు. షేమ్ ఆన్ యు”

ఇకనైనా మనిషిగా బతకాలని బండారుకు గడ్డిపెట్టారు రాధిక. నిజంగా విలువలు, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తే… భేషరతుగా రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.