అశోక్‌బాబును కుళ్ల‌పొడిచిన ఆంధ్రా మేధావి

పాపం టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు. ఆయ‌న‌కు సొంత పార్టీ నుంచి మ‌ద్ద‌తు క‌రువైంది. ఇక పౌర స‌మాజం నుంచి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. అశోక్‌బాబును ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల కంటే సామాజిక కార్య‌క‌ర్త‌లే…

పాపం టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు. ఆయ‌న‌కు సొంత పార్టీ నుంచి మ‌ద్ద‌తు క‌రువైంది. ఇక పౌర స‌మాజం నుంచి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. అశోక్‌బాబును ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల కంటే సామాజిక కార్య‌క‌ర్త‌లే ఎక్కువ‌గా టార్గెట్ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో అశోక్‌బాబును ఆంధ్రా మేధావుల ఫోరం క‌న్వీన‌ర్ చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి కుళ్ల పొడిచారు.

అశోక్‌బాబు పేరు వింటే చ‌ల‌సాని అస‌లు ఓర్వ‌లేరు. గ‌తంలో ఓ ప్ర‌ముఖ చాన‌ల్ డిబేట్‌లో ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం తిట్ల‌తో దాడి చేసుకున్నంత ప‌ని చేశారు. బ‌హుశా ఎదురెదురుగా ఉండింటే భౌతిక దాడుల‌కు పాల్ప‌డే వారేమ‌న‌న్న అనుమానం అప్ప‌ట్లో వీక్ష‌కుల‌కు క‌లిగింది. అశోక్‌బాబును ఆంధ్రా ద్రోహిగా శ్రీ‌నివాస‌రావు అభివ‌ర్ణిస్తే, అస‌లు ఇలాంటి సంస్కారం లేని వాళ్ల‌ను డిబేట్ల‌కు ఎందుకు పిలిచార‌ని అశోక్ ప్ర‌శ్నించ‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో ఉద్యోగంలో ప‌దోన్న‌తి, ఆ త‌ర్వాత ఎన్నిక‌ల సంఘానికి తాను డిగ్రీ ప‌ట్టుభ‌ద్రుడిగా త‌ప్పుడు స‌మాచారం ఇచ్చారంటూ తాజాగా సీఐడీ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీన్ని ప‌ట్టుకుని అశోక్‌బాబుపై ప‌రోక్షంగా త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఆంధ్రా మేధావుల ఫోరం క‌న్వీన‌ర్ శ్రీ‌నివాస‌రావు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇంత‌కూ ఆయ‌న పోస్టు ఏంటో చూద్దాం.

“డిగ్రీ చదవకుండా  ఆ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు వెలగపెట్టి, పెన్షన్లు తీసుకుంటూ డిగ్రీ  చదివామని అఫిడవిట్లో వ్రాసి APలో MLC లు కూడా అయిపోతున్నారంట నిజమేనా? చదవలేకపోవడం తప్పు కాదు, చాలామందికి కుదరదు. కానీ అవాస్తవాలు చెప్పడం, దాన్ని బట్టి ఉద్యోగాలు, ఉద్యమ నాయకత్వంలో ప్లాంటెడ్ లీడర్లవ్వడం జరిగితే కచ్చితంగా తప్పు. 

ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండి రాకీ పార్టీల అభ్యర్థులకు, ఎన్నికల్లో ప్రచారం చేయడం, (వేరే రాష్ట్రాలకు వెళ్లి కూడా!) తరువాత  పదవుల ఇంకా … నజరానాలు పొందడం తప్పున్నర. ఇక ఆంధ్ర ద్రోహులను అందలం ఎక్కించి కొన్ని పార్టీలు తప్పు చేస్తున్నాయి. కొందరు నిందితులు, నేరస్తులు కూడా రాకీనాలవుతున్నారనే ఆరోపణలు కూడా నిజమే. 

కానీ మరి కొందరు అయిదు కోట్ల ఆంధ్రులని ఉద్యమాన్ని ముంచి నిలువునా మోసం చేయలేదా, వాళ్ళ ఫేమ్ కోసం తెలంగాణ ప్రజలను, సంస్కృతిని దారుణంగా అవమానించలేదా… అది హేయం కాదా?. అటునుంచి కూడా కొందరు అలాగే చేశారు అది కూడా తప్పు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉండి, పనిచేసి ఎవరూ వారి ప్రాంతానికి ఇలా అన్యాయం చేయలేదు” అని చ‌ల‌సాని రాసుకొచ్చారు.

ఇందులో అశోక్‌బాబు అని ప్ర‌త్యేకంగా పేరు రాయ‌క‌పోయినా, ఆయ‌న గురించే అనేది సుస్ప‌ష్టం. గ‌తంలో క‌ర్నాట‌క‌కు వెళ్లి టీడీపీ వ్య‌తిరేకించిన బీజేపీని ఓడించాల‌ని అశోక్‌బాబు ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చిన టీడీపీని కూడా చ‌ల‌సాని త‌ప్పు ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అలాగే త‌ప్పుడు స‌ర్టిఫికెట్ల‌తో అంద‌లం ఎక్కిన అశోక్‌ను దెప్పి పొడిచారు.