పవన్ 29 కోసం ఆ ముగ్గురూ?

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత మొదలైన సినిమా వకీల్ సాబ్. చకచకా పూర్తయిపోయి, ఈ ఏడాది దసరా నాటికి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా రెడీ అవుతుంది అనుకుంటే కరోనా కాటేసింది. సరే, ఆ…

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత మొదలైన సినిమా వకీల్ సాబ్. చకచకా పూర్తయిపోయి, ఈ ఏడాది దసరా నాటికి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా రెడీ అవుతుంది అనుకుంటే కరోనా కాటేసింది. సరే, ఆ సినిమా తరువాత క్రిష్, హరీష్ శంకర్ ల సినిమాలు లైన్ లో వుండనే వున్నాయి. ఇవి అన్నీ అలా అనౌన్స్ మెంట్ స్టేజ్ లో వుండగానే, మరో సినిమా అంటే పవన్ కళ్యాణ్ 29 వ ప్రకటన రాబోతోందని వార్తలు వినవస్తున్నాయి

ఈ సినిమాకు నిర్మాత పేరు దాదాపుగా ఖరారుగా వినిపిస్తోంది. జనసేన కోసం తన వంతు కృషి తాను చేసిన రామ్ తాళ్లూరి నిర్మాతగా వుండే అవకాశం వుంది. అయితే దర్శకుడు ఎవరు? ఎవరు? 

ఈ సందర్భంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి పవన్ కు ఇష్టమైన డాలీ. రెండు సైరా లాంటి భారీ సినిమా చేసిన సురేందర్ రెడ్డి. మూడు రవితేజ తో క్రాక్ సినిమాను తయారుచేసిన గోపీచంద్ మలినేని.

రామ్ తాళ్లూరి ఈ ముగ్గురికి ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరు తమ కథతో, పవన్ ను ఒప్పిస్తారో, వారికే డైరక్షన్ చాన్స్ అంట. అందుకే ఇప్పుడు ఈ ముగ్గురూ ఈ పనిలో బిజీగా వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరి పేరు ఫైనల్ లిస్ట్ లోకి వస్తే, క్రిష్, హరీష్ శంకర్ ల సరసన మరో డైరక్టర్ పేరు లైన్ లోకి వస్తుంది.

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే

ఇదీ జగన్ విజన్