రామ్ పోతినేని..ఇదా చేయాల్సిన పని

మన వాళ్లు అనే సరికి మన హీరోలకు ఎక్కడ లేని అభిమానం వచ్చేస్తుంది. తప్పు చేసినా ఒప్పులా కనిపిస్తుంది. విజయవాడ స్వర్ణ ప్యాలస్ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చిన రమేష్ హాస్పిటల్…

మన వాళ్లు అనే సరికి మన హీరోలకు ఎక్కడ లేని అభిమానం వచ్చేస్తుంది. తప్పు చేసినా ఒప్పులా కనిపిస్తుంది. విజయవాడ స్వర్ణ ప్యాలస్ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చిన రమేష్ హాస్పిటల్ ను వెనకేసుకు వస్తున్నాడు హీరో రామ్ పోతినేని. దీంతో నెటిజన్లకు మండుకు వచ్చింది. ఏనాడూ ఎవరికి సాయం చేసిన పాపానికి పోలేదు కానీ, ఇప్పుడు ఓ కమర్షియల్ ఆసుపత్రిని వెనుకేసుకు వస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. 

నిజానికి రామ్ చేసిన ప్రకటనలోనే తప్పు వుంది. ప్రభుత్వం ఇటు స్వర్ణ ప్యాలస్ పైనా, అటు రమేష్ ఆసుపత్రిపైనా చర్యలకు ఉపక్రమించింది. తప్పు ఎవరిదో తేల్చడానికి కమిటీలు వేసింది. కొన్ని అరెస్టులు చేసింది. కానీ రామ్ మాత్రం తప్పంతా స్వర్ణ ప్యాలస్ ది, ఆ మాటకు వస్తే, దానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వానిది, అంతకు ముందు ప్రభుత్వం కూడా అక్కడ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించింది కదా? అనే లా పాయింట్లు లాగారు.

రామ్ తీసిన లా పాయింట్ల సంగతి ఎలా వున్నా, అలాంటి మాటలు మాట్లాడాల్సింది రమేష్ ఆసుపత్రి యాజమాన్యం. అంతేగానీ హీరోగా రామ్ కాదు. ఆయనకు ఆ ఆసుపత్రి యాజమాన్యంతో బంధాలు, బాంధవ్యాలు వుంటే వుండొచ్చు. అయినా కూడా అలా మాట్లాడకూడదు, నిజంగా ఆయనకు ఈ సంఘటన మీద మాట్లాడాలని అనిపిస్తే, బాధితులకు న్యాయం చేయాలని అడగాలి. లేదా ఆయన వంతు సాయం చేయాలి.

ఇవన్నీ వదిలేసి నేర నిర్ధారణ అయ్యేలోగా విషయాన్ని ప్రభావితం చేసే మాదిరిగా, కేసు ట్రయిల్ ప్రారంభం అయ్యే లోగానే వాదనకు దిగిన విధంగా రామ్ లా పాయింట్లు లాగడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతోంది. అసలే రెడ్ సినిమా విడుదలకు పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలు రామ్ కు అవసరమా?

ఇదీ జగన్ విజన్

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే