మెగాస్టార్ మెగా మూవీ సైరా సెకెండ్ వీకెండ్ ముగిసింది. భారీ రేట్లు, మీడియం రేట్లు అన్ని ముచ్చట్లు అయిపోయాయి. ఇప్పుడు ఇక సాదా సీదా రేట్లే. అందువల్ల ఇక కలెక్షన్ల ఫిగర్లు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. షేర్ వస్తుంది కానీ, మరీ చెప్పుకునేంత కాకపోవచ్చు. ఈవారం అంతా కలిపి ప్రతి ఏరియాకు మహా అయితే మరో యాభై లక్షలు యాడ్ అయ్యే అవకాశం అయితే వుంది.
ఈ నేపథ్యంలో సైరా బయ్యర్ల లాభ నష్టాలు చూసుకుంటే.. చలామణీలో వున్న ఫిగర్ల ప్రకారం. చలామణీలో అని అనడం ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ ఫిగర్ల మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. తొలిరోజే కలిపేసారని, అక్కడ కలిపారని, ఇక్కడ కలిపారని ఫ్యాన్స్ హడావుడి ఓ రేంజ్ లో వుంది. పోనీ అదంతా యాంటీ ఫ్యాన్స్ వ్యవహారం అని అనుకున్నా, ఈ ఫిగర్లే కరెక్ట్ అనుకున్నా, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. సీడెడ్ లో మరో రెండు కోట్లు, గుంటూరులో మరో రెండు కోట్లు, ఈస్ట్ లో మరో కోటిన్నర, వెస్ట్ లో మరో రెండుకోట్లు, కృష్ణాలో కోటిన్నరకు పైగా వసూళ్లు రావాల్సివుంది.
ఇప్పటికే థియేటర్లు తగ్గించారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమాలు ఏవీ లేవు కానీ, అలా అని సినిమాల సీజన్ కూడా కాదు. దసరా సెలవులు అయిపోయాయి. మళ్లీ స్కూళ్లు ఇతరత్రా వ్యవహారాలు మొదలైపోయాయి. అందువల్ల ఇక వచ్చే షేర్ నామమాత్రంగానే వుంటుంది. సైరా ఉత్తరాంధ్రలో మంచి ఫలితాలు నమోదు చేయడానికి కారణం అక్కడ డిస్ట్రిబ్యూటర్ క్రాంతిరెడ్డి, తొలివారం ఏకంగా మూడు వందల యూనిఫారమ్ రేటు, మలివారం రెండు వందల యూనిఫారమ్ రేటు తీసుకురావడం. ఇది నిజంగా కాస్త ధైర్యం చేయడమే. అయితే అదే కలిసి వచ్చింది. బ్రేక్ ఈవెన్ ముందుగా అయిన ఏరియాగా ఉత్తరాంధ్ర మిగిలింది.
ఇక నైజాం ముఫై కోట్లు దాటిందని చెబుతున్నారు. ఖర్చులు వున్నాయి. ఇకపై వచ్చే షేర్ ను దానికి లెక్క వేసుకోవచ్చు. అందువల్ల అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయినట్లే. నెల్లూరు లాంటి చిన్న ఏరియా కూడా బాగానే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది. ఇవి మినహా మరే ఏరియా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు అంతగా కనిపించడం లేదు. పైగా ఇప్పుడు కనిపిస్తున్న ఫిగర్లు అన్నీజీఎస్టీ కలుపుకుని, అంటే సైరా యూనిట్ మొత్తం బయ్యర్ల జీఎస్టీ అంతా తనేకట్టాలి. అలా కడితేనే ఈ ఫిగర్లు. అలా కట్టకుండా బయ్యర్లే కట్టుకోవాలంటే మాత్రం ఏరియాకు కనీసం కోటి రూపాయల వంతున తేడా వస్తుంది.
ఇదిలావుంటే వందకోట్లు ఏపి తెలంగాణలో దాటేసింది షేర్ అని అంటున్నారు కానీ ఈ టోటల్ వంద కోట్లు దాటడంలేదు. ఈరోజు కలెక్షన్లతో దాటేసే అవకాశం వుంది. కానీ టోటల్ గా బ్రేక్ ఈవెన్ చూసుకుంటే, ఖర్చులు కాకుండా మరో ఎనిమిది కోట్ల వరకు రావాల్సి వుంటుంది. కనీసం పదిశాతం ఖర్చులు కలుపుకున్నా ఇంకో పదికోట్ల వరకు రావాలి.
ఇధిలావుంటే సైరా ఓన్ రిలీజ్ చేసిన తమిళ, మళయాల, కన్నడ, హిందీ వెర్షన్లు డిజాస్టర్లుగా మిగిలాయి. ఓవర్ సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంగానే వుంది. ఓవరాల్ గా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా నైజాం, ఉత్తరాంధ్ర, నెల్లూరు మాత్రమే ఇప్పటికి సేఫ్ జోన్ లోకి అడుగుతపెట్టిన ఏరియాలు. ఈవారం తరువాత ఫైనల్ లెక్కలు తేలతాయి.
సైరా కలెక్షన్ల వివరాలు..
బ్రాకెట్ లో వున్నవి సేల్స్ ఫిగర్లు..
పక్కన వున్నవి చలామణీలో వున్న కలెక్షన్ల వివరాలు.
ఇవి జీఎస్టీ కలుపుకుని.
నిజానిజాలు డిసిఆర్ లకు ఎరుక.
నైజాం…..(30) ….30.90
సీడెడ్……(20) ….17.95
ఉత్తరాంధ్ర(14.40).15.45
ఈస్ట్………(9.80)… 8.15
వెస్ట్……….(8.40)….6.32
కృష్ణా……. (9.00) ….7.19
గుంటూరు..(11.50)…9.36
నెల్లూరు…..(4.80)….4.35