జనసేన మరో వికెట్ డౌన్!

ఎన్నికల ముందు చేరిన వారు ఎన్నికలు ముగియగానే ఎవరి దారి వారు చూసుకుంటున్నట్టుగా ఉన్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనది పాతికేళ్ల రాజకీయం అని ప్రకటించుకుంటూ ఉంటారు. అయితే ఎన్నికల ముందు ఆ…

ఎన్నికల ముందు చేరిన వారు ఎన్నికలు ముగియగానే ఎవరి దారి వారు చూసుకుంటున్నట్టుగా ఉన్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనది పాతికేళ్ల రాజకీయం అని ప్రకటించుకుంటూ ఉంటారు. అయితే ఎన్నికల ముందు ఆ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి నేతలను చేర్చుకున్నారు. పాతికేళ్ల రాజకీయం చేయాలనుకునే వాళ్లు నేతలను తయారు చేసుకోవాలి. తెచ్చుకోకూడదు. నీతులున్నది చెప్పడానికే అని  భావించే పవన్ కల్యాణ్.. తను పాటించేది మాత్రం పెద్దగా ఉండదు.

ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల ముందు వచ్చిన నేతలు ఎన్నికలు ముగిసిన తర్వాత వారి వారి దారుల్లో వెళ్లిపోతూ ఉన్నారు. తాజాగా పడిన జనసేన వికెట్ ఆకుల సత్యనారాయణ. భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లారు ఆకుల. జనసేన తరఫు నుంచి ఎంపీగా పోటీ చేసినట్టుగా ఉన్నారు.

ఈయన బీజేపీని వీడక ముందే వీరి భార్య జనసేనలోకి వెళ్లి కర్చిఫ్ వేశారు. ఎన్నికల సమయంలో ఆకుల వెళ్లి చేరారు. అందరు జనసేన అభ్యర్థుల్లాగా ఈయన కూడా ఓటమి పాలయ్యారు.  ఇప్పుడు జనసేనను వీడారు.