‘విజయ్’ లవర్ వచ్చేసాడు

విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా టైటిల్ ఇటీవలే ప్రకటించారు. క్రాంతిమాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మించే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పుడు వదిలారు.…

విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా టైటిల్ ఇటీవలే ప్రకటించారు. క్రాంతిమాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మించే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పుడు వదిలారు. వరల్ఢ్ ఫేమస్ లవర్ గా విజయ్ దేవరకొండ ఎలా వున్నాడు, ఎలా వుంటాడు అన్నది ఈ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. వాస్తవంగా చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ ఎలావుంటే ఫ్యాన్స్ కు నచ్చుతాడో అలా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

మొహం మీద గాయాలతో, నెత్తుటి మరకలతో, స్మోక్ చేస్తూ, పొగలు బయటకు వదులుతూ కనిపించాడు విజయ్ దేవరకొండ. ఇదిలావుంటే విజయ్ ను ఈ లుక్ లో చూడడం అన్నది అభిమానులకు కొత్త కాదు. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో ఇలాగే కనిపించాడు. మళ్లీ దాదాపు అదే లుక్ అనుకోవాలి. అయితే గతంలో లుక్ లకు ఇప్పటి దానికి తేడా ఏమిటంటే, కాస్త ఫెరోషియస్ గా వున్నాడు.

వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ సరసన, రాశీఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. క్రాంతిమాధవ్ తన స్టయిల్ డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

పవన్ సినిమా క్యాన్సిల్ అయితే నా మానసిక పరిస్థితి ఇది