నవదీప్ ఒక్కడికే ఆ బంపర్ ఆఫర్?

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు సినీప్రముఖుల్ని ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి 3 రోజులు ఈ దర్యాప్తుకు మీడియాలో విపరీతంగా ప్రచారం వచ్చింది. ఏదో జరగబోతోంది అనే రేంజ్ లో కలరింగ్…

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు సినీప్రముఖుల్ని ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి 3 రోజులు ఈ దర్యాప్తుకు మీడియాలో విపరీతంగా ప్రచారం వచ్చింది. ఏదో జరగబోతోంది అనే రేంజ్ లో కలరింగ్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత మీడియా ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేసింది.

రవితేజ, రానా లాంటి హీరోల విచారణ సందర్భంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసింది. అయితే ఇప్పుడు మీడియా దృష్టి మరోసారి ఈడీ విచారణపై పడింది. దీనికి కారణం నవదీప్.

ఐదేళ్ల కిందట ఈ కేసు మొదలైనప్పట్నుంచి చాలామంది నవదీప్ వైపు అనుమానంగా చూశారు. అలాంటి వ్యక్తి మరోసారి విచారణకు హాజరవుతున్నాడనగానే ఆటోమేటిగ్గా మీడియా ఎటెన్షన్ ఇటు తిరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈడీ అధికారులు నవదీప్ ను సుదీర్ఘంగా 9 గంటల పాటు ప్రశ్నించారు.

అక్కడితో నవదీప్ ఎపిసోడ్ ముగియలేదు. విచారణకు మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు నవదీప్ ను ఆదేశించారు. ఇదే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఇప్పటివరకు విచారణకు హాజరైన ఏ సెలబ్రిటీని ఈడీ ఇలా అడగలేదు. నవదీప్ విషయంలో మాత్రం మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పడం కొసమెరుపు.

నవదీప్ తో పాటు, ఎఫ్-క్లబ్ మేనేజర్ ను ఒకేసారి ప్రశ్నించారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కేసులో మనీ ల్యాండరింగ్ కు సంబంధించి వివరాలు అడిగారు. అయితే మేనేజర్ తో పాటు నవదీప్ పొంతనలేని సమాధానాలు ఇచ్చారట. పైగా కొన్ని ప్రశ్నలకు నవదీప్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడట. దీంతో మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు నవదీప్ కు స్పష్టంచేశారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పూరి జగన్నాధ్, చార్మి, రకుల్, రానా, నందును ప్రశ్నించింది ఈడీ. ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్ లను విచారించాల్సి ఉంది.