వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే “బ్రాందీ డైరీస్”.
గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం* “బ్రాందీ డైరీస్”. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు.
ఏప్రిల్లో విడుదల కు ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా. చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ… సినిమా మీద ప్యాషన్తో మిత్రులతో కలిసి 2019లో మొదలు పెట్టాము. మిత్రుల సహకారంతో క్రౌడ్ ఫండెడ్ మూవీ గా నిర్మించడం జరిగింది. నాచురల్ లొకేషన్స్ లలో యాభై రెండు రోజుల్లో 104 లొకేషన్స్ లలో సింగిల్ షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడం జరిగింది.ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుందని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ..తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా మూవీ మాక్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఏప్రిల్లో విడుదల కు ఏర్పాట్లు చేస్తున్న మా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
హీరో శేఖర్ మాట్లాడుతూ… .ఎంతోమంది సీనియర్ నటులు ఆడిషన్స్ కు వచ్చినా సినిమా గురించి నాకు ఏవిధమైన అవగాహన లేకున్నా ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.దర్శక నిర్మాతల సపోర్టుతో సినిమా చేయడం జరిగింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు
హీరోయిన్ సునీత సద్గురు మాట్లాడుతూ .. ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆల్కహాల్ గురించి తెలుపుతూ లవ్ స్టోరీ ను జోడించి ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం జరిగిందని అన్నారు.