త్రివిక్రమ్‌ బ్యాక్‌ టు ఫామ్‌?

త్రివిక్రమ్‌ మరోసారి 'అ' సెంటిమెంట్‌కే మొగ్గు చూపాడు. 'అజ్ఞాతవాసి' ఫ్లాప్‌ అయినా, 'అరవింద సమేత'  యావరేజ్‌ అనిపించుకున్నా తాజా చిత్రానికి ముందు 'అల' జోడించాడు త్రివిక్రమ్‌. టైటిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కానీ  ఫస్ట్‌ లుక్‌…

త్రివిక్రమ్‌ మరోసారి 'అ' సెంటిమెంట్‌కే మొగ్గు చూపాడు. 'అజ్ఞాతవాసి' ఫ్లాప్‌ అయినా, 'అరవింద సమేత'  యావరేజ్‌ అనిపించుకున్నా తాజా చిత్రానికి ముందు 'అల' జోడించాడు త్రివిక్రమ్‌. టైటిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కానీ  ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ అయితే చాలా ఇంప్రెస్‌ చేసింది. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్‌ సినిమాలో హీరో పక్కింటి అబ్బాయిలా కనిపించాడు.

అల్లుఅర్జున్‌ గెటప్‌, మురళి శర్మ లుక్‌, హౌస్‌ సెటప్‌ అంతా మధ్యతరగతి లుక్‌కి తగ్గట్టుగా వుంది. త్రివిక్రమ్‌ సినిమాలు ఇలా కనిపించి చాలా కాలమవుతోంది. హీరోని అయితే విపరీతమైన హీరోదాత్తుడిగానో లేదా అపర కుబేరుడిలానో చూపించడం పరిపాటి అయింది. త్రివిక్రమ్‌ మళ్లీ రూట్స్‌కి వచ్చి ఒక సగటు కుటుంబ కథని రాసాడనే ఫీలింగ్‌ని ఈ టీజర్‌ తెచ్చింది.

అల్లు అర్జున్‌కి అనుకోకుండా వచ్చిన గ్యాప్‌ని చమత్కారంగా సినిమాలో డైలాగ్‌గా చెప్పించడం కూడా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ టీజర్‌ తర్వాత 'అల వైకుంఠపురములో'పై అంచనాలు పెరిగాయి. మహేష్‌ చేస్తోన్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'సరిలేరు నీకెవ్వరు'కి ఎదురు వెళ్తోన్న ఈ చిత్రం ఎలాంటి వైబ్‌ అయితే క్రియేట్‌ చేయాలో దానిని క్రియేట్‌ చేయగలిగింది.

మరి త్రివిక్రమ్‌ నిజంగానే ఫామ్‌లోకి వచ్చాడా లేక ఇది జస్ట్‌ ఒక మెరుపు మాత్రమేనా అనేది చూడాలి. 

రణరంగం సినిమాపై ప్రేక్షకులు ఏమన్నారంటే