టాలీవుడ్ లో ఓ చిత్రమైన విషయం వినిపిస్తోంది. మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్ లో తయారవుతున్న ఆచార్య సినిమాను జనవరి 7న విడుదల చేస్తారన్నది పాయంట్. కానీ అది కాదు చిత్రం.
అసలు ఈ సినిమా పోయి పోయి మూడు భారీ సినిమాలు ఇప్పటికే డేట్ లు లాక్ చేసిన నేపథ్యంలో రిలీజ్ డేట్ లాక్ చేయడం అన్నది మరో పాయింట్. ఇది మెగాస్టార్ నిర్ణయం కాదు. దర్శకుడు కొరటాల అభిమతం.
అయితే మరి మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అక్కడే వుందికదా? అంటే అదంతా మెగాస్టార్ నే చూసుకుంటారు అని కొరటాల అనుకున్నారట.
అయితే 'జనవరి 7న విడుదల చేయాలనుకుంటే చేయండి. అంతేకానీ నేను తమ్ముడికి చెప్పి, వెనక్కు వెళ్లమని అడగను. వాళ్లదీ సినిమానే. వారం గ్యాప్ వుంది కదా చాలు' అని మెగాస్టార్ అన్నారన్నది గ్యాసిప్. అదీ చిత్రమైన సంగతి.
అసలు వేరే సినిమాలు రుమాలు వేసిన చోట తన సినిమా విడుదల ఆపొచ్చు కదా. అలా కాకుండా తాను చెప్పనని మెగాస్టార్ అనడం ఏమిటో? వేరే వాళ్లే అర్ధం చేసుకుని వెనక్కు వెళ్లాలనా? లేదా దర్శకుడు కొరటాల శివకు చెప్పలేకనా? ఏమో?