రాక్షసుడు..మెప్పిస్తాడు: బెల్లంకొండ

డిఫరెంట్‌ జోనర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందించిన చిత్రం 'రాక్షసుడు'.  ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.…

డిఫరెంట్‌ జోనర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందించిన చిత్రం 'రాక్షసుడు'.  ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.

`రాక్షసుడు` వెంటాడాడు
– మామూలుగా సినిమా మొదలుపెట్టిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ప్యాకప్‌ అయిపోతే సినిమా నుండి డిటాచ్‌ అవుతా. కానీ ఈ సినిమా విషయంలో నేను డిటాచ్‌ కాలేకపోయాను. ఎక్కడ చూసినా పత్రికల్లో మా సినిమాలో జరిగిన ఘటనలకు రిలేట్‌ అయ్యే ఇంటర్వ్యూలే కనిపించేవి.

పోలీస్‌ ఆఫీసర్‌గా సెకండ్‌ టైమ్‌
– పోలీస్‌ ఆఫీసర్‌గా 'కవచం' చేశాను కానీ, ఎక్కడో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ కాలేదు. కానీ ఈసారి పోలీస్‌ ఆఫీసర్‌గా చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో యాక్షన్‌ లేదు, పాటలు, డ్యాన్సులూ లేవు. డిఫరెంట్‌గా ఉంటుంది.

నెగిటివిటీ కాదు ఇంటెన్సిటీ?
– సినిమా పూర్తిగా నెగటివిటీ అని అనలేం కానీ, అంత ఇంటెన్సిటీ మాత్రం ఉంటుంది. మామూలుగా నేను నెగటివిటీకి దూరంగానే ఉంటాను. ఎక్కడ పాజిటివ్‌ వాతావరణం ఉంటే, అక్కడ నేనుంటాను.

ఇదే నా మొదటి సినిమా?
– ఇన్ని రోజులు నేను మా దర్శకులు ఏం చెబితే అదే చేశా. నాకోసం 'ఇంకో టేక్‌ చేద్దాం సార్‌' అని కూడా ఎవరితోనూ అనలేదు. కానీ ఈ సినిమాకు ఆ స్వాతంత్రం వచ్చింది. అందువల్ల ఇంకా ఎక్కువ బాగా చేయగలిగాను. 85 రోజులు షూటింగ్‌ చేశా. నిర్విరామంగా ఆదివారం, సెలువులు లేకుండా పనిచేశా. ఎక్కువగా నైట్‌ షూటింగ్‌లు జరిగాయి. అందుకే అలా ఫీలయ్యా.

రెండోసారి రీమేక్‌ చేస్తున్నారు
రీమేక్‌ ఎప్పుడూ 90 శాతం ఈజీగానే ఉంటుంది. 10 శాతం కష్టంగా ఉంటుంది. ఆ కష్టం కూడా కంపేరిజన్‌ వస్తుందనే తప్ప మిగతాది ఈజీగానే ఉంటుంది.

మాస్‌ సినిమాలకు దూరంగా 
– డ్యాన్సులు, ఫైట్లు మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ నాక్కూడా ఉంది. ఈ కథలో వాటిని జోడిస్తే ఆడియన్స్‌కి ఆ ఫీల్‌ మిస్సవుతుంది. అందుకనే తమిళ వెర్షన్‌కి సాధ్యమైనన్ని తక్కువ మార్పులు చేశాం.

కమర్షియల్ మూవీస్
– నెక్స్ట్ కమర్షియల్ మూవీనే చేయాలని ఆలోచన ఉంది. ఆ కమర్షియల్ చిత్రాలలో ఉండే డాన్స్ లు ఫైట్లు మిస్ అవుతున్నాను.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి