ఏపీకి అన్నీ ఇచ్చేశామంటున్న కాషాయం నేతలు

ఓ వైపు కేంద్రం కరోనా వంటి విపత్తు వేళ కనీసమాత్రంగా ఆదుకోవడంలేదని తెలంగాణాకు చెందిన ముఖ్యమంత్రి కేసీయార్ ఏకిపారేస్తున్నారు. ప్యాకేజి కాదూ పాడూ కాదు అంటూ ఏకంగా గాలి తీసేశారు. Advertisement మరోవైపు చూసుకుంటే…

ఓ వైపు కేంద్రం కరోనా వంటి విపత్తు వేళ కనీసమాత్రంగా ఆదుకోవడంలేదని తెలంగాణాకు చెందిన ముఖ్యమంత్రి కేసీయార్ ఏకిపారేస్తున్నారు. ప్యాకేజి కాదూ పాడూ కాదు అంటూ ఏకంగా గాలి తీసేశారు.

మరోవైపు చూసుకుంటే లాక్ డౌన్ తో రాష్ట్రాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. కనీసంగా కూడా ఆదాయం లేకుండా పోయాయి. ఈ నేపధ్యంలో ఏపీకి ఎంతో చేశాం, నిధులు ఇచ్చేశామని కాషాయం చెబుతూంటే వింతా, విచిత్రమే మరి.

ఏపీకి దాదాపుగా 2,800 కోట్ల వరకూ కేంద్రం సాయం చేసిందని, కరోనా విపత్తుని ద్రుష్టిలో పెట్టుకుని ఇచ్చిన ఈ నిధులు ఏపీ సర్కార్ తన సొంతం అన్నట్లుగా వాడేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటున్నారు.

ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులను తమ పేరుతో జనాలకు పంచుతున్నారట. నిజంగా విడ్డూరమే. ఏపీలో వైసీపీ సర్కార్ ప్రతీ కుటుంబానికి వేయి రూపాయలు నగదు ఇచ్చింది. అంతే కాదు, రేషన్ సరకులు నెలకు మూడు సార్లు ఇచ్చింది. ఇక అన్ని వర్గాలకు సంక్షేం కోసం నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము వేస్తోంది.

ఓ విధంగా ఏపీలో నగదు బదిలీ పధకం అమలవుతోంది. అందువల్ల పెదవాళ్ళ జేబుల్లో ఎంతో కొంత అయినా కరెన్సీ కనిపిస్తోంది. మరి భారీ ఆర్ధిక ప్యాకేజిల పేరు చెప్పి హడావుడి చేసిన కేంద్రం ఏమీ రాష్ట్రాలకు ఇవ్వడంలేదని దేశంవ్యాప్తంగా గోల పెడుతూంటే ఎంతో ఇచ్చేశామని కాషాయం నేతలు చెప్పుకోవడం దారుణమే మరి. 

తెలంగాణా ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాం