బోనాలు చేస్తున్న శంకర్

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా పేర్లు మార్చడం అనేది కొత్తేం కాదు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, జై లవకుశ, నేనేరాజు నేనేమంత్రి లాంటి ఎన్నో సినిమాలకు కొత్తకొత్త పేర్లు పెట్టి ప్రీ-రిలీజ్…

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా పేర్లు మార్చడం అనేది కొత్తేం కాదు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, జై లవకుశ, నేనేరాజు నేనేమంత్రి లాంటి ఎన్నో సినిమాలకు కొత్తకొత్త పేర్లు పెట్టి ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు చేశారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. బోనాలు పేరిట కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పక్కా హైదరాబాదీ కుర్రాడిలా కనిపించబోతున్నాడు రామ్. సినిమా కూడా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. అందుకే తెలంగాణ కల్చర్ కనిపించేలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బోనాలు అని పేరుపెట్టారు. ఈ ఆదివారం బోనాలు చేసుకుందాం రండి అంటూ అందర్నీ ఆహ్వానిస్తున్నారు.

కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ లో నిర్వహించడం లేదు. హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో బోనాలు చేయబోతున్నారు. నిజంగానే ఇది బోనాలు సీజన్. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే బోనాలు షురూ అయ్యాయి. నిన్న గోల్కొండలో ఇవి ప్రారంభమయ్యాయి. జులై 28న ఓల్డ్ సిటీలో జరిగే సంబురాలతో బోనాలు ముగుస్తాయి.

ఈ ఫెస్టివ్ మూడ్ ను క్యాష్ చేసుకునేందుకు ఇస్మార్ట్ శంకర్ యూనిట్ కూడా తమదైన శైలిలో బోనాలు నిర్వహించాలని నిర్ణయించింది. 18న ఇస్మార్ట్ శంకర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. 

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్ రాదే!