అచ్చం అయ్యన్న బాటలోనే …

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం మొత్తం ఇపుడు రాజకీయాలలో ఉన్నట్లే లెక్క.  Advertisement అయ్యన్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు. ఆయన పెద్ద కుమారుడు విజయ్‌పాత్రుడు రాష్ర్ట…

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం మొత్తం ఇపుడు రాజకీయాలలో ఉన్నట్లే లెక్క. 

అయ్యన్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు. ఆయన పెద్ద కుమారుడు విజయ్‌పాత్రుడు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి. చిన్న కుమారుడు రాజేష్ పాత్రుడు నర్శీపట్నం మునిసిపాలిటీ కౌన్సిలర్, అయ్యన్న సతీమణి పద్మావతి కూడా తాజాగా జరిగిన ఎన్నికలలో కౌన్సిలర్‌గా గెలిచారు. 

అయితే అయ్యన్న కుటుంబానికే సొంతమన్నట్లుగా ఉన్న నర్శీపట్నం మునిసిపాలిటీ ఇపుడు వైసీపీ పరం అయింది. దాంతో అయ్యన్న బాటలోనే సతీమణి, కుమారుడు కూడా వైసీపీ మీద విమర్శలు చేస్తూ తమ రూట్ ఇదేనని చెబుతున్నారు. 

కౌన్సిల్ సమావేశానికి వారు గైర్ హాజర్ కావడమే కాకుండా అధికార పక్షం మీద ఆరోపణలు కూడా చేశారు. కరోనా వేళ వర్చువల్ విధానంలో కౌన్సిల్ సమావేశం జరపాలని అయ్యన్న కుమారుడు, సతీమణి కౌన్సిలర్లుగా డిమాండు చేశారు. 

దానిని కాదని మామూలుగానే సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా కౌన్సిల్‌కే డుమ్మా కొట్టారు. 

ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉంటాయని తమ్ముళ్లు అంటున్నారంటే అయన్న కుటుంబం మొత్తానికి వ్యతిరేక రాజకీయమేనా అని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. 

ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, అభివృద్ధి పట్ల ఆసక్తి లేకపోతే ప్రజా ప్రతినిధులుగా గెలిచి లాభమేంటి అని కూడా ఎద్దేవా చేస్తున్నారు.