మహేష్ సినిమాలో జల్లికట్టు

కొన్నాళ్ల క్రితం వరకు జల్లికట్టు అంటే తమిళనాడు జనాలకే కానీ మిగిలినప్రాంతాలకు అంతపరిచయం లేదు. కమల్ గతంలో తన సినిమాలో జల్లికట్టును ఓ సారి చూపించాడు. ఇప్పుడు దర్శకుడు మురుగదాస్ కూడా మహేష్ సినిమాలో…

కొన్నాళ్ల క్రితం వరకు జల్లికట్టు అంటే తమిళనాడు జనాలకే కానీ మిగిలినప్రాంతాలకు అంతపరిచయం లేదు. కమల్ గతంలో తన సినిమాలో జల్లికట్టును ఓ సారి చూపించాడు. ఇప్పుడు దర్శకుడు మురుగదాస్ కూడా మహేష్ సినిమాలో జల్లికట్టు ప్రస్తావని తేబోతున్నాడట. అయితే జల్లికట్టు ప్రదర్శన ఏమీ వుండదు.

జల్లి కట్టు విషయంలో తమిళనాడు జనం అందరూ స్పందించిన తీరు, మెరీనా బీచ్ లో శాంతియుత ఆందోళన నిర్వహించిన తీరు చూసిన తరువాత మురగదాస్ కు కొత్త అయిడియాలు వచ్చాయని తెలుస్తోంది. ప్రజలు నిస్థబ్తుగా, నిస్తేజంగా వున్నారు అనుకుంటాం కానీ, అవసరమైనపుడు ఈ విధమైన రియాక్షన్ భయంకరంగా ఫ్రదర్శిస్తారు కదా? 

అదే సంభవామి క్లయిమాక్స్ లోకి తీసుకునే ఆలోచనలో వున్నారట. హీరోకు అండగా జనం నిల్చోవడం లాంటిదన్నమాట. ఈ మేరకు స్క్రిప్ట్ క్లయిమాక్స్ సీన్లలో మార్పులు చేయబోతున్నట్లు వినికిడి. ఈ సినిమాను మురగదాస్ తమిళ, తెలుగు భాషల్లో చిత్రీకరిస్తున్నారు కాబట్టి, ఇలాంటి ఇన్సిడెంట్ లను సినిమాలో చొప్పిస్తే, రియాక్షన్ బాగానేవుంటుంది.