ఒక్క హిట్టు..పాతిక లక్షలు

టాలీవుడ్ లో అంతే.. టాలీవుడ్ లో అంతే.. ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు..రేటు పైకి పాకడం ప్రారంభమవుతుంది. కొత్త హీరోయిన్ లు అంటే జస్ట్ ఖర్చులకు ఇచ్చి, తీసుకుంటారు. అది హిట్ అయితే అక్కడి…

టాలీవుడ్ లో అంతే.. టాలీవుడ్ లో అంతే.. ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు..రేటు పైకి పాకడం ప్రారంభమవుతుంది. కొత్త హీరోయిన్ లు అంటే జస్ట్ ఖర్చులకు ఇచ్చి, తీసుకుంటారు. అది హిట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రేటు.. ముందు పాతిక.. ఆ పై యాభై.. కోటి.. ఇలా. కనుముక్కు తీరు అద్భుతంగా లేకున్నా, సరైన ఏక్టింగ్ స్కిల్స్ లేకున్నా, ఆ పాత్రకు అలా సరిపోయింది.. హెబ్బా పటేల్.. కుమారి 21 ఎఫ్ లో. 

అది హిట్ అవడంతో సినిమాలు కుప్పలు తెప్పలుగా వస్తాయని అనుకున్నారు. ఆ మేరకు గ్యాసిప్స్ కూడా వదిలేసారు.. ఇదిగో ఎన్టీఆర్ అంటే.. అదిగో సినిమా అంటూ. కానీ అవన్నీ గాలి వార్తలు అని తేలిపోయింది. ఆఖరికి ఇప్పుడు వరుణ్ తేజ్ పక్కన సినిమా దొరికింది. దీనికి పాతిక లక్షలు ఫీజు కోరినట్లు వినికిడి. 

సరే కుర్రకారులో కొంతయినా క్రేజ్ వుంది కదా అని నిర్మాత సై అన్నారుట. అయితే తీరా చేసి, ఆ సినిమాలో ఈ అమ్మడిది మెయిన్ క్యారెక్టర్ కాదట. మరి ఆ మాత్రం దానికే పాతిక లక్షలు పట్టేసింది అంటే, మరో హిట్ కొడితే డబుల్ చేసేయడం గ్యారంటీ.