సర్దార్ కు బాబి ఓన్లీ డైరక్షన్?

సర్దార్ సినిమాకు డైరక్టర్ బాబి అన్న సంగతి తెలిసిందే. అయితే బేసిక్ గా బాబి (రవీంద్ర) మంచి రచయిత. అట్నుంచే డైరక్షన్ వైపు వచ్చారు. రవితేజ బాబి రచనాశైలి నచ్చి, డైరక్టర్ గా అవకాశం…

సర్దార్ సినిమాకు డైరక్టర్ బాబి అన్న సంగతి తెలిసిందే. అయితే బేసిక్ గా బాబి (రవీంద్ర) మంచి రచయిత. అట్నుంచే డైరక్షన్ వైపు వచ్చారు. రవితేజ బాబి రచనాశైలి నచ్చి, డైరక్టర్ గా అవకాశం ఇచ్చాడు. పవన్ కూడా గబ్బర్ సింగ్ 2 (సర్దార్) స్క్రిప్ట్ సంతృప్తికరంగారావడం లేదనే, బాబి రైటర్ కనుక సెట్ చేస్తాడని అవకాశం ఇచ్చాడు. 

అయితే ఇప్పుడు తాజా ఖబర్ ఏమిటంటే, బాబి ఈ సినిమా కథ, కథనాలు సెట్ చేసి వుండొచ్చు కానీ, సంభాషణలు మాత్రం బుర్రా సాయి మాధవ్ రాస్తున్నారన్నది. ఈ సినిమాకే కాదు, పవన్-డాలి (గోపాల గోపాల దర్శకుడు) సినిమాకు కూడా బుర్రాయే మాటల రచయితట. 

మంచి మాటల రచయితగా పేరు తెచ్చుకున్నా, కమర్షియల్ రైటర్ గా ఇంకా పేరు రాలేదు బుర్రాకు. పవన్ సినిమాలతో ఈ లోటు తీరిపోతుందని అనుకుంటున్నాడట.