హీరోలకు, డైరక్టర్లకు ఇచ్చేపారితోషికాలు పక్కన పెడితే, ఇండస్ట్రీలో ఫామ్ లో వున్న హీరోలకు, డైరక్టర్లకు ఎప్పుడో తీయబోయే సినిమాల కోసం ఇచ్చిన అడ్వాన్స్ లు లెక్క పెడితే యాభై కోట్లు దాటిపోతుందని వినికిడి. ఈ అడ్వాన్స్ ల్లో యాభై వేలు, లక్ష దగ్గర నుంచి పది పన్నెండు కోట్ల వరకు వున్నాయట.
మహేష్ దగ్గర దాదాపు ముగ్గురు నలుగురు నిర్మాతల అడ్వాన్స్ లు వున్నాయట. వీరిలో కెఎల్ నారాయణ, భవ్య సంస్థ, ఇంకా మరో సంస్థ వున్నాయంట. అలాగే పవన్ దగ్గర మైత్రీమూవీస్, పివిపి, తదితరల అడ్వాన్స్ లు వున్నాయట. ఇక దర్శకుడు పూరి దగ్గర ముగ్గురు, నలుగురు నిర్మాతల అడ్వాన్స్ లు వున్నాయట. బోయపాటి దగ్గర కూడా అడ్వాన్స్ లు బాగానే వున్నాయని వినికిడి.
ఇక చిన్నా చితకా దర్శకుల సంగతి లెక్కనేలేదు. వీళ్లలో భాయ్ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి కూడా వున్నారు. సినిమా రంగంలో ఎవరి దగ్గరా స్వంత డబ్బులు వుండవు. మూడు రూపాయిల నుంచి అయిదు రూపాయిల వడ్డీకి తేవడమే. యాభై కోట్ల అడ్వాన్స్ లు అంటే, సుమారు నెలకు పదిహేను లక్షల వడ్డీలు..ఎవరికిస్తేనే ఎవరు కడితేనేం..పాపం, ఈ హీరోలు, డైరక్టర్లు ఎప్పుడు కనికరిస్తారో, ఎప్పుడు ప్రాజెక్టులు సెట్ అవుతాయో? ఎప్పుడు సినిమాలు మొదలవుతాయో?