కమల్ తెలుగు సినిమా ఇప్పట్లో లేదు

తెలుగు ప్రేక్షకులతో అవసరం వున్నపుడల్లా  తమిళ జనాలు తెలుగుసినిమా జపం చేస్తుంటారు. ఆ మధ్య శంకర్ ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు కమల్ కూడా అదే అన్నారు. తరువాతి సినిమా తెలుగుదే అని ఆయన చెప్పారు.…

తెలుగు ప్రేక్షకులతో అవసరం వున్నపుడల్లా  తమిళ జనాలు తెలుగుసినిమా జపం చేస్తుంటారు. ఆ మధ్య శంకర్ ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు కమల్ కూడా అదే అన్నారు. తరువాతి సినిమా తెలుగుదే అని ఆయన చెప్పారు. కానీ ఇప్పట్లో తెలుగు సినిమాచేసే అవకాశం వున్నట్లు లేదు. 

ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు ఆయన కొంతమంది మీడియా జనాలతో మాట్లాడుతూ, తెలుగు సినిమా చేయాలనే వుంది కానీ గొప్ప కథేమీ రావడం లేదని అన్నారట. కథలు చెపుతున్నారు కానీ, తనకు నచ్చడం లేదన్నారట. 

కమల్ కు నచ్చే కథలు ఆయన మాత్రమే రాసుకోగలరు. మన వారి కథలు కమల్ రేంజ్ కు వుండవని, మన తెలుగు సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కమల్ అంత గొప్ప కథ తయారుచేసుకుంటే, తమిళ, తెలుగు చేస్తారు కానీ, తెలుగులో చేసి తమళంలోకి వెళ్లరు. బహుశా కమల్ తెలుగు సినిమా ఇప్పట్లో వుండకపోవచ్చు.