కాబోయే భార్యకు ఆ మూడూ తెలుసుండాలి

తనకు కాబోమే భాగస్వామి గురించి అమ్మాయిలకయినా అబ్బాయిలకయినా కొన్న అంచనాలు తప్పకుండా ఉంటాయి. ఇక సినిమా వాళ్లకయితే విచిత్రమైన అంచనాలు ఉంటాయి. హీరో దగ్గుబాటి రానాకు మాత్రం తనకు కాబోయే భార్యకు తెలుగు, తమిళం,…

తనకు కాబోమే భాగస్వామి గురించి అమ్మాయిలకయినా అబ్బాయిలకయినా కొన్న అంచనాలు తప్పకుండా ఉంటాయి. ఇక సినిమా వాళ్లకయితే విచిత్రమైన అంచనాలు ఉంటాయి. హీరో దగ్గుబాటి రానాకు మాత్రం తనకు కాబోయే భార్యకు తెలుగు, తమిళం, హిందీ భాషలు తప్పని సరిగా వచ్చి ఉండాలి అని చెబుతున్నాడు. పెళ్ళి అనేది తప్పని సరిగా జరగాల్సిందే. కాబట్టి కాబోయే భార్యలో అన్నీ మంచి లక్షణాలే ఉండాలని అందరూ కోరుకుంటారు. 

రానా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి’ త్వరలో విడుదల కానుంది. ఆ సినిమాలో బల్లాల దేవుడిగా విలనిజం ఉన్న పాత్రలో నటించాడు. హీరో ప్రభాస్‌కు సరిసమానమైన క్యారెక్టర్‌ చేసాడట. తన బాడీ బిల్డింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లోని ప్రావీణ్యం అన్నీ ‘బాహుబలి’ సినిమాకు చక్కగా ఉపయోగపడ్డాయని చెబుతున్న రానాకు ఇప్పట్లో పెళ్లి  చేసుకునే వెసుసుబాటు అయితే లేదట. హీరోగా ఇంకా ఎంతో సాధించాల్సి ఉందంటున్నాడు. 

తాతయ్య రామానాయుడు అంటే రానాకు ఎంతో ఇష్టం. తన సక్సెస్‌తో పాటు పెళ్ళినీ ఆయన చూస్తాడని ఆశించిన రానాకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక అమ్మాయిల గురించి తనకు సదభిప్రాయమే ఉందనీ, వాళ్ల అభిరుచుల్లో,  ఆలోచనల్లో ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయనీ, అబ్బాయిలూ, అమ్మాయిలూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం అవసరం అనీ, భార్య హౌస్‌ వైఫ్‌ అయినా చక్కటి మేనేజ్‌మెంట్‌ లక్షణాలు కలిగి ఉండాలంటున్న రానాకు అలాంటి భార్య దొరకాలని ఆశిద్దాం.