ఇండియా, కివీస్ ల మధ్యన క్రైస్ట్ చర్చ్ లో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రోజే భారత బ్యాట్స్ మన్ చేతులు ఎత్తేసిన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆసక్తిదాయకంగా సాగింది ఆట. తొలి రోజు ధాటిగా కనిపించిన కివీ బ్యాట్స్ మన్ రెండో రోజు చేతులెత్తేశారు. 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్ జట్టు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులు చేసింది. దీంతో ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించినట్టు అయ్యింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్ మళ్లీ పాత కథనే రిపీట్ చేశారు. తొలి ఇన్నింగ్స్ తో పోల్చినా మరింత తక్కువ స్థాయి బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. దీంతో 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. స్థూలంగా 97 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత జట్టు. క్రీజ్ లో విహారి, పంత్ ఉన్నారు. కనీసం రెండు వందల పరుగుల పై స్థాయి ఆధిక్యాన్ని సంపాదించగలిగితే.. టీమిండియా ఈ మ్యాచ్ లో కచ్చితంగా పోటీలో ఉంటుంది.
రెండో రోజు ఆటలో 90 ఓవర్లకు గానూ ఏకంగా 16 వికెట్లు కూలడం విశేషం. 63 పరుగులకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా న్యూజిలాండ్ రెండో రోజు ఆటను మొదలుపెట్టింది. మరో 172 పరగులును జోడించి పది వికెట్లనూ కోల్పోయింది. ఆ తర్వాత ఇండియావి 6 వికెట్లు పడటంతో.. ఒకే రోజు 16 వికెట్లు పడినట్టుగా అయ్యింది.
తొలి టెస్టులో భారత బ్యాట్స్ మన్ పూర్తిగా చేతులెత్తేశారు. ఆ మ్యాచ్ లో బౌలర్లు కూడా పేలవమైన ప్రదర్శన చేయడంతో.. న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఆ మ్యాచ్ లో గెలిచింది. ఇప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ కొద్ది మేర రాణించినా.. సీరిస్ ను సమం చేసే అవకాశం భారత జట్టుకు ఉన్నట్టే!
బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు