ఇలాంటి వారి బంధం దృఢంగా ఉన్న‌ట్టు!

దాంప‌త్యం బంధం ఎంత దృఢంగా ఉందో తెలుసుకోవాలంటే ఈ జాబితాను ఒకసారి త‌ర‌చి చూస్తే అర్థం చేసుకోవ‌చ్చంటున్నారు రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్. ఏ దంప‌తులు అయితే ఆనందంగా గ‌డుపుతున్నారో, ఎవ‌రి బంధం అయితే…

దాంప‌త్యం బంధం ఎంత దృఢంగా ఉందో తెలుసుకోవాలంటే ఈ జాబితాను ఒకసారి త‌ర‌చి చూస్తే అర్థం చేసుకోవ‌చ్చంటున్నారు రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్. ఏ దంప‌తులు అయితే ఆనందంగా గ‌డుపుతున్నారో, ఎవ‌రి బంధం అయితే దృఢంగా ఉందో, అలాంటి వారిలో ఈ జాబితాలోని అంశాల జాడ క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఇంత‌కీ దృఢ‌మైన బాంధ‌వ్యంలో ఉన్న జంట‌ల్లో ఉండే ఆ ల‌క్ష‌ణాలు ఏవంటే!

ఇద్ద‌రూ స‌ర‌దాగా గ‌డుపుతారు!

ఇది చాలా చిన్న విష‌య‌మే! చాలా సింపుల్ విష‌య‌మే! అయితే భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ స‌ర‌దాగా ఉండ‌టం అంటే మాట‌లేమీ కాదు. కొన్ని సంవ‌త్స‌రాల జీవినం త‌ర్వాత‌.. ఇద్ద‌రూ క‌లిసి ఒక ఫ‌న్ యాక్టివిటీతోనో, ఏదైనా ఆట‌తోనో, పాట‌తోనో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం అంటే తేలికేమీ కాదు! పైకి చాలా చిన్న విష‌యంగానే క‌నిపించినా.. ఇద్ద‌రూ క‌లిసి ఆట‌ప‌ట్టించుకుంటూనూ, లేదా మ‌రో ఆట‌తోనో.. స‌ర‌దాను పొందుతున్నారంటే, వారి బంధం నిస్సందేహంగా దృఢంగా ఉన్న‌ట్టే!

ఫ్రెండ్స్, ఫ్యామిలీ స‌పోర్ట్!

ఏ జంట‌కు అయితే కుటుంబం నుంచి, స్నేహితుల నుంచి అవ‌స‌ర‌మైన స‌పోర్ట్ ద‌క్కుతుందో ఆ జంట బంధం కూడా దృఢ‌మైన‌దే! అది ల‌వ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. వీరి మ‌ధ్య‌న పొర‌పొచ్చ‌లు వ‌చ్చిన‌ప్పుడో, చిన్న చిన్న గొడ‌వ‌లు చెల‌రేగినా, అవ‌స‌ర‌మైన మాట సాయం చేసే, వీరి క‌ష్ట సుఖాల‌ను పంచుకునే ఫ్యామిలీ ఉన్నా, ఈ త‌ర‌హా ఫ్రెండ్స్ ఉన్నా.. ఆ బంధం దృఢంగా నిల‌బ‌డే అవ‌కాశం ఉంటుంద‌నేది నిపుణుల మాట‌!

మంచి సంభాష‌ణ‌!

భార్య‌భ‌ర్త‌లు కూర్చుని ఏదైనా, అదేదైనా స‌రే కాసేపు సంభాషించుకుంటున్నారంటే వారి బంధం కూడా బ‌ల‌మైన‌దే! టాపిక్ ఏదైనా కావొచ్చు.. ఇద్ద‌రికీ ఆస‌క్తిదాయ‌క‌మైన‌ది, లేదా ఒక‌రి ఆస‌క్తి మేర‌కు ఇద్ద‌రూ మాట్లాడుకునేది, చ‌ర్చించుకునేది, ఆలోచ‌న‌ల‌ను పంచుకునే సంభాష‌ణ‌లు సాగుతున్నాయంటే ఆ జంట బంధం బ‌ల‌మైన‌దే!

అర్థ‌వంత‌మైన మౌనం!

కేవ‌లం మాట‌లే కాదు, మౌనం కూడా బంధంలోని గాఢ‌త‌ను చాటే అంశ‌మే. అతిగా మాట్లాడుకోవ‌డం చాలా సార్లు అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. అదే స‌మ‌యంలో అవ‌త‌లి వారి మౌనాన్ని అర్థం చేసుకోవ‌డం కూడా గొప్ప విష‌యం. అర్థ‌వంత‌మైన మౌనం కూడా దంప‌తులు ఒక‌రినొక‌రు అర్థం చేసుకున్నా కూడా ఆ బంధం దృఢ‌మైన‌దే అని క‌చ్చితంగా చెప్పొచ్చు. అవ‌త‌లి వారి మాట‌ల క‌న్నా మౌనాన్ని అర్థం చేసుకుంటున్నారంటే వారు చాలా ప‌రిణ‌తి చెందిన వార‌ని అర్థం.

మ్యూచువ‌ల్ రెస్పెక్ట్!

ఇది ఇచ్చుపుచ్చునేది! చాలా త‌క్కువ జంట‌లే ఈ త‌ర‌హాలో మ‌ర్యాద‌ను ఇచ్చి పుచ్చుకుంటాయ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. భ‌ర్త‌కు భార్య లోకువ‌, భార్య‌కు భ‌ర్త లోకువ అనే ప‌ద్ధ‌తి సాగే సంసారాలు పైకి సాగాల్సిందే కానీ, అందులో లోటేమిటో వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. అయితే ఒక‌రి ఆలోచ‌న‌ల‌కు మ‌రొక‌రు , ఒక‌రికి మ‌రొక‌రు మ‌ర్యాద‌లు ఇచ్చిపుచ్చుకునే జంట‌లు నిస్సందేహంగా గాఢ‌మైన అనుబంధాన్ని క‌లిగిన‌వే!

ఒకేర‌క‌మైన ఆస‌క్తులు!

ఇద్ద‌రికీ ఒకేర‌క‌మైన ఆస‌క్తులు ఉండ‌టం కూడా అరుదుగా జ‌రిగేదే. ట్రావెలో, ఇంట్లోనే ఉండ‌ట‌మో, లేదా బ‌య‌ట తిర‌గ‌డ‌మో.. అదేమైనా స‌రే, ఒకేర‌క‌మైన ఆస‌క్తి ఉందంటే మాత్రం వారు జంట‌గా చెల‌రేగిపోయే అవ‌కాశాలు ఉంటాయి . ఇలాంటి ఆస‌క్తులు కూడా చాలా జంట‌ల‌ను స‌ర‌దాగా సాగిపోయేలా నిలుపుతాయి!

6 Replies to “ఇలాంటి వారి బంధం దృఢంగా ఉన్న‌ట్టు!”

  1. ఇదివరకు అత్తలు ప్రాబ్లెమ్ అని చెప్పేవారు అప్పటి మహిళలు కూడా ఎక్కువ మంది పిల్లలతో పుట్టింటికి వెళితే వెంటనే ఇంట్లోవాళ్ళు ఇరుపొరుగు వాళ్ళు కూడా ఆ మహిళకు నచ్చచెప్పి భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని పంపించేవారు ఇప్పుడు పిల్లలు సాధారణం గ ఒకరు కన్నా ఎక్కువ ఉండుటలేదు వివాహిత తల్లి కుమార్తె కుటుంబం లో జోక్యం చేసుకొని వీళ్ళ కి గొడవలు వస్తే ఇమ్మీడియేట్ గ ఆ బిడ్డతో సహా కుమార్తె ను పుట్టింటిటికి తీసుకు పోతున్నారు భర్తను నరకప్రాయం చేస్తున్నారు డివోర్స్ లు ఏడాది లోనికి ఇచ్చేయాలి పెళ్లివయసు దాటి పోయాక వస్తే ఏమి ఉపయోగం ఉండదు అబ్బాయి కి కనీసం తన బిడ్డను కూడా చూపరు ఇది ప్రస్తుత పరిస్థితి

Comments are closed.