ఇప్పుడు నిడివి తగ్గించి ఏం లాభం!

ఒక్కసారి సినిమా జనంలోకి వెళ్లిందంటే ఇక చేసేదేం లేదు. అదే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందంటే ఎన్ని రిపేర్లు చేసినా ఉపయోగం ఉండదు. అలా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకు, 4 రోజుల తర్వాత…

ఒక్కసారి సినిమా జనంలోకి వెళ్లిందంటే ఇక చేసేదేం లేదు. అదే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందంటే ఎన్ని రిపేర్లు చేసినా ఉపయోగం ఉండదు. అలా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకు, 4 రోజుల తర్వాత రిపేర్లు చేస్తే..? దీనికి సమాధానం ఉండదు. ఏదో సందర్భంలో త్రివిక్రమ్ చెప్పినట్టు రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్లిపోవడమే.

కంగువా విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. మొదటి రోజు కంటెంట్ లోపాలకు తోడు టెక్నికల్ మిస్టేక్స్ బయటపడ్డాయి. రెండో రోజుకే టెక్నికల్ గా సినిమాను సరిచేశారు, అదే టైమ్ లో కంటెంట్ లో లోపాల్ని కూడా చక్కదిద్దితే గుడ్డిలోమెల్ల అన్నట్టుండేది పరిస్థితి. కానీ రిలీజైన 4 రోజులకు కంగువా రన్ టైమ్ తగ్గించారు.

కంగువా సినిమా నిడివి 12 నిమిషాలు తగ్గించారు. ట్రిమ్ చేసిన వెర్షన్ ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుంది. రెండు కాలాల్లో కంగువా సినిమా కథ సాగిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కాలానికి సంబంధించిన సన్నివేశాల్ని ట్రిమ్ చేశారు. మరీ ముఖ్యంగా గోవా ఎపిసోడ్ లో చాలా సీన్లు లేపేశారు.

సినిమా నిడివి తగ్గించాల్సిన అవసరం లేదని, రిలీజైన రెండో రోజు నిర్మాత స్పందించాడు. దేవర సినిమా ఎలాగైతే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న తర్వాత పుంజుకుందో, తమ సినిమా కూడా అలానే లేస్తుందని అన్నాడు. కానీ నిర్మాత భావించినట్టు జరగలేదు.

దీంతో తప్పనిసరి పరిస్థితులు మధ్య రన్ టైమ్ తగ్గించారు. అయితే ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. సినిమాకు ఆడియన్స్ వచ్చేది అనుమానమే.

7 Replies to “ఇప్పుడు నిడివి తగ్గించి ఏం లాభం!”

  1. డైరెక్టర్ కి ఎలాంటి successful ట్రాక్ రికార్డు లేకుండా వందల కోట్లు కుమ్మరించి సినిమాలు ఎలా తీస్తారో అర్థం కాదు.

  2. చిన్న హీరో లు, unknown డైరెక్టర్ లతో KGF, కాంతారా pan ఇండియా హిట్స్ అయ్యేసరికి ప్రతీ హీరో కి అత్యాశ ఎక్కువై పోయింది.

Comments are closed.