Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ హీరోయిన్ చీర వెనక కష్టం ఇది!

ఆ హీరోయిన్ చీర వెనక కష్టం ఇది!

హీరోయిన్లు కట్టే చీరలు చూడ్డానికి సింపుల్ గా ఉంటాయి. కానీ వాటి రేట్లు, వాటిని తయారుచేసి విధానం తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతాం. మొన్నటికిమొన్న అయోధ్య ఆలయానికి వెళ్లినప్పుడు ప్రియాంక చోప్రా కట్టిన చీర రేటు చూసి కళ్లు తేలేశారు చాలామంది. ఇప్పుడు అలియా భట్ వంతు వచ్చింది.

వరుసగా రెండో ఏడాది మెట్ గలా ఈవెంట్ కు హాజరైంది అలియా భట్. ఈ వేడుకలో ఆమె ఓ పువ్వుల చీర ధరించింది. డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన చీర ఇది. చూడ్డానికి సింపుల్ గా ఉన్న ఈ చీరను తయారు చేయడానికి 163 మంది శ్రమించారు. వీళ్లంతా కలిసి 1965 గంటలు కష్టపడి ఈ చీరను తయారు చేశారు.

ఈ ఏడాది ఈవెంట్ లో థీమ్ పేరు స్లీపింగ్ బ్యూటీస్ - రివోకనింగ్ ఫ్యాషన్. ఈ థీమ్ కు తగ్గట్టు ఈ చీరను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ చీర ధరించిన అలియా భట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతేడాది మెట్ గాలా థీమ్ కార్ల్ లాగర్ ఫెల్డ్ - ఏ లైన్ ఆఫ్ బ్యూటీ. ఆ థీమ్ కు తగ్గట్టు గతేడాది తెలుపు రంగు గౌన్ ధరించి హోయలొలికించింది అలియాభట్. ఈ ఏడాది సంప్రదాయబద్ధంగా ఇలా చీరకట్టులో కనిపించింది.

అయితే ఓవైపు అలియాభట్ చీర కట్టు వైరల్ అవుతున్నప్పటికీ, మరోవైపు ఇదే డ్రెస్ పై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఎందుకంటే, గతంలో దీపిక పదుకోన్ ఇదే డిజైన్ చీరను కట్టుకొని ఓ ఫంక్షన్ కు హాజరైంది. అప్పుడు దీపిక ధరించిన చీరకు, ఇప్పుడు అలియా కట్టిన శారీకి పెద్దగా తేడా లేదంటున్నారు జనం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?