Advertisement

Advertisement


Home > Movies - Movie News

అల్లరి నరేష్.. ఓటిటి టైమ్ వచ్చింది!

అల్లరి నరేష్.. ఓటిటి టైమ్ వచ్చింది!

ఇలా అంటే అదేదో కించపరిచినట్లు అనుకుంటారేమో కానీ, అల్లరి నరేష్ త్వరగా ఓటిటి రంగం మీద దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది. ఇటు సినిమాలు చేస్తూనే అటు ఓటిటిలో కూడా స్ట్రయిట్ గా ప్రాజెక్ట్ లు చేయడం అన్నది బాలీవుడ్ లో, టాలీవుడ్ లో ప్రారంభమైంది. సీనియర్ హీరో వెంకీ, యంగ్ హీరోలు రానా, చైతన్య, హీరోయిన్ సమంత ఇలా చాలా మంది ఓటిటిలో ప్రాజెక్ట్ లు చేసారు. చేస్తున్నారు. అంత మాత్రం చేత వాళ్లకు థియేటర్ మార్కెట్ లేదని కాదు. అక్కడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ కింగ్. వరుస విజయాలు. ఆ రోజుల్లోనే మూడు నుంచి నాలుగు కోట్ల రెమ్యూనిరేషన్. ఇప్పుడు అందరి హీరో రెమ్యూనిరేషన్లు ముందుకు వెళ్తుంటే అల్లరి నరేష్ మాత్రం తగ్గించుకోవాల్సి వస్తోంది. కాలం మారింది. సరైన కామెడీ రైటర్లు తగ్గిపోతున్నారు. సరైన కామెడీ స్ఖ్రిప్ట్ లు రావడం లేదు. దాంతో ఆ జానర్ లో హిట్ లు పడడం లేదు. మంచి నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని సీరియస్ సినిమాలు చేస్తుంటే పేరు వస్తోంది కానీ నిర్మాతలకు డబ్బులు రావడం లేదు. ఇలా డైలామాలో వుండిపోవాల్సి వస్తోంది.

ఎంత కాలం సరైన కామెడీ రైటర్లు లేరు.. తప్పు అదే తప్ప తనది కాదు అని చెబుతూ వెళ్తారు. ఇలాంటి టైమ్ లో ఓటిటిలో ఇప్పుడు కామెడీ స్పేస్ ఫుల్ ఖాళీగా వుంది. రకరకాల షో ల ద్వారా కామెడీ జానర్ ను ఫిల్ చేస్తున్నారు తప్ప, సరైన కామెడీ వెబ్ సిరీస్ లు లేవు. ఒకప్పుడు అమృతం అనే కామెడీ సిరీస్ ఎంత అలరించింది, ఇప్పటికీ ఎంత అలరిస్తోంది అన్నది గమనించాలి.

ఓటిటి దుకాణం తెరిస్తే చాలు, వయిలెన్స్, సెక్స్, బూతులు, థ్రిల్లర్లు పరుచుకుంటున్నారు. కనీసం ఆహా, ఈటీవీ విన్ లాంటి వాటిలో సరైన హెల్తీ ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీస్ వుంటే ఫ్యామిలీలు దగ్గరకు తీసుకుంటాయి. ఆ గ్యాప్ ను ఒక్కసారైనా ఫిల్ చేసే ఆలోచన అల్లరి నరేష్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి కనుక ఒక్క సరైన సిరీస్ కనుక పడితే ఓటిటి లో అల్లరి నరేష్ మళ్లీ కింగ్ అయిపోతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?