ఓ సినిమా హిట్టయినప్పుడు ఇతర హీరోలు మెచ్చుకోవడం కామన్. అయితే ఆ మెచ్చుకునే టైమింగ్ కూడా చాలా ముఖ్యం. అలాంటి ఓ రాంగ్ టైమింగ్ లో పోస్టు వేసి, ట్రోలింగ్ కు గురవుతున్నాడు అల్లు అర్జున్. ఇంతకీ ఏం జరిగిందంటే..
రజినీకాంత్ నటించిన జైలర్ 2 పెద్ద హిట్టయింది. దీనికి శుభాకాంక్షలు తెలుపుతూ బన్నీ ఓ పోస్టు పెట్టాడు. “చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఒక్క రజినీకే సాధ్యం” అంటూ అల్లు అర్జున్ పెట్టిన పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. అదే టైమ్ లో వివాదాస్పదమైంది కూడా.
జైలర్ 2 సక్సెస్ తర్వాత చిరంజీవి, రజినీకాంత్ మధ్య పోలికలు ఎక్కువయ్యాయి. రజినీకాంత్ లా చిరంజీవి కూడా వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకోవాలని కొందరు సూచిస్తుంటే, మరికొందరు మాత్రం చిరంజీవి నటనతో పోలిస్తే, రజినీకాంత్ నటన చాలా తక్కువ అంటూ కొన్ని సినిమాల్ని కోట్ చేస్తున్నారు.
ఇలా ఒక రోజు, రెండు రోజులు కాదు, వారానికి పైగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సున్నితమైన పరిస్థితుల మధ్య, రజినీకాంత్ ను పొగుడుతూ బన్నీ పోస్టు పెట్టాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కు మండింది.
ఇప్పటికే బన్నీపై ఓ రకమైన వ్యతిరేకతతో ఉన్నారు మెగాభిమానులు. చిరంజీవిని ఆల్ రౌండర్‌గా, డాన్స్, కామెడీ, యాక్షన్ లో అతనికి తిరుగులేదంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు. వారం రోజులుగా ఓవైపు ఇలా ఉద్యమంలా ఇది సాగుతుంటే.. మధ్యలో అల్లు అర్జున్ వేసిన పోస్టు, వాళ్లను తీవ్ర అసహనానికి గురి చేసింది.
దీంతో కొన్ని గంటలుగా రజినీని పక్కపెట్టి, బన్నీపై విరుచుకుపడుతున్నాయి కొన్ని మెగా హ్యాండిల్స్. అల్లు అర్జున్ తన మూలాల్ని మరిచిపోకూడదని, చిరంజీవి లేకపోతే బన్నీకి ఇంత గుర్తింపు వచ్చేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ వాదనలు, ట్రోలింగ్స్ కేవలం బాక్సాఫీస్ నంబర్స్ కే పరిమితం కాకుండా.. స్టార్ డమ్, మార్కెట్ రీచ్, హిందీ ఆడియన్స్ పై ఈ ఇద్దరు హీరోల ప్రభావం వరకు విస్తరించాయి.
సౌత్ సినిమాలో ఇలాంటి పోలికలు, ఫ్యాన్ వార్స్ కొత్తవి కావు. ప్రతి పెద్ద విజయం తర్వాత ఒక స్టార్‌ను మరొకరితో పోల్చి చర్చలు మొదలవుతాయి. జైలర్ 2 విజయం, అల్లు అర్జున్ ప్రశంసలు మళ్లీ చిరంజీవి-రజినీకాంత్ చర్చను ముందుకు తెచ్చాయి.
అయితే ఈ ఇద్దరి మధ్య పోలిక అనవసరం. ఇద్దరూ తమ తమ ఇండస్ట్రీల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న నటులు. ఇద్దర్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే చర్చ అనవసరం. ఇందులోకి బన్నీ పెట్టిన పోస్టును లాగి, అతడ్ని విమర్శించడం అంతకంటే అనవసరం.

ఎవ్వడు వాడిని, వాడి కొడుకుని తప్ప వేరే ఎవరిని పొగడ కూడదు. లేకపోతే బతుకు బస్టాండ్. మెగా మాఫియా
నచ్చితే నచ్చిందని చెప్పే హక్కు కూడా లేదా?
Rajanikanth tho yevaruu compare cheyaleru aaa craze veruuu .
Nuv rayakunda undatam maku avasaram
Jailer 1 movie blockbuster hit, Kani Jailer 2 movie bagaledhu