ఈ ఒక్కటి మిస్ ఫైర్.. నీకు అర్థమౌతోందా రావిపూడి

సినిమాల్ని ఎంత ఫాస్ట్ గా తీస్తాడో, ప్రచారంలో కూడా అంతే ఫాస్ట్ గా ఉంటాడు అనీల్ రావిపూడి. అతడి ప్రచార వ్యూహాల్ని అందుకోవడం అంత వీజీ కాదు

సినిమాల్ని ఎంత ఫాస్ట్ గా తీస్తాడో, ప్రచారంలో కూడా అంతే ఫాస్ట్ గా ఉంటాడు అనీల్ రావిపూడి. అతడి ప్రచార వ్యూహాల్ని అందుకోవడం అంత వీజీ కాదు. ప్రస్తుతం చేస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాకు కూడా అలాంటి వ్యూహాలే అనుసరిస్తున్నాడు.

ఇందులో భాగంగా అతడు విడుదల చేస్తున్న రీల్స్, చేస్తున్న స్కిట్స్ ఎప్పటికప్పుడు క్లిక్ అవుతున్నాయి. అయితే ప్రమోషన్ లో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియో మాత్రం మిస్ ఫైర్ అయింది. విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియా మొత్తం నెగెటివ్ కామెంట్స్ తో నిండిపోయింది.

‘జనవరి 12 విడుదల’కు సంబంధించి తాజాగా లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో విడుదల కోసం అనీల్ రావిపూడి చేసిన స్కిట్ అదిరింది. కానీ లిరికల్ వీడియోలో హీరోయిన్లు ఇద్దరూ కలిసి వేసిన స్టెప్ పై మాత్రం విమర్శలు తప్పలేదు.

డివికి..డివికి అనే లిరిక్స్ తో రిలీజ్ చేసిన ఈ డాన్స్ మూమెంట్ పై ట్రోల్స్ పడుతున్నాయి. ‘ఈ ఒక్క స్టెప్ తో హీరోయిన్లను ఐటెంభామలుగా మార్చేశారు’ అనే కామెంట్ చాలా చిన్నది. లోపలకు వెళ్లేకొద్దీ ఇక్కడ రాయడానికి వీల్లేని విమర్శలు. వీటన్నింటికీ కారణం ఈ ఒక్క స్టెప్.

టాలీవుడ్ లో డాన్స్ బిట్స్ వివాదాస్పదమవ్వడం కొత్తేం కాదు. గతంలో బాలయ్య వేసిన ఓ డాన్స్ మూమెంట్ వివాదాస్పదమైంది. నితిన్ సినిమాలో కూడా ఓ స్టెప్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైతే, ఏకంగా సినిమాలో కనిపించకుండా చేశారు.

ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’ సినిమాలో ఈ స్టెప్ వాటికి ఏమాత్రం తీసిపోదంటున్నారు జనం. మరీ ముఖ్యంగా ఈ పాటను అనుకరిస్తూ వస్తున్న రీల్స్ మరింత ఎబ్బెట్టుగా ఉండడంతో, విమర్శలు పీక్ స్టేజ్ కు వెళ్లిపోయాయి.

ఈ విమర్శల్ని అడ్డుకునేందుకు ఇప్పటికే కొన్ని హ్యాండిల్స్ కు నోటీసులిస్తున్నారు. అయితే ఇలా సోషల్ మీడియా ఎకౌంట్లకు నోటీసులు పంపించినంత మాత్రాన ట్రోల్స్ ఆగవనే విషయాన్ని యూనిట్ తెలుసుకోవాలి.

అసలే సంక్రాంతికి వస్తున్న సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమా. ఇలాంటి సినిమాలో అలాంటి స్టెప్ పెట్టడం ఎంత వరకు కరెక్ట్. అసలేం జరుగుతుందో నీకు అర్థమౌతోందా రావిపూడి!

5 Replies to “ఈ ఒక్కటి మిస్ ఫైర్.. నీకు అర్థమౌతోందా రావిపూడి”

  1. To be honest … అనుకున్నంత బజ్ లేదు… అంత ఇంట్రెస్ట్ కూడా జనాలు చూపుతున్నట్టు లేదు. ఈసారి దొరికేసేలా ఉన్నాడు. 

  2. ఇతని సినిమాలు నాకు నచ్చవు. అసలు సంక్రాంతికి వస్తున్నాం ఎలా హిట్ అయిందో అర్ధం కాదు. C గ్రేడ్ కామెడీ.

  3. ఇతని సినిమాలు నాకు నచ్చవు. అసలు సంక్రాంతికి వస్తున్నాం ఎలా హిట్ అయిందో అర్ధం కాదు. C గ్రే డ్ కా మెడీ.

Comments are closed.