నాడు వెన్నుపోటు … నేడు ఓటు పోటు

ప్రొద్దుటూరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌తో నామినేష‌న్లు వేయించ‌క‌పోవ‌డం, అలాగే కొంత మందితో మాత్ర‌మే వేయించ‌డం తీవ్ర వివాదానికి దారి తీసింది.

ప్ర‌జాభిప్రాయంతో ఏ మాత్రం సంబంధం లేకుండా దౌర్జ‌న్యంగా ఏర్ప‌డిన నూత‌న మున్సిప‌ల్ పాల‌క మండ‌లి ప్ర‌మాణ స్వీకారాన్ని నిర‌సిస్తూ ప్రొద్దుటూరులో వైసీపీ వినూత్య కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి నేతృత్వంలో ప్ర‌జాద్రోహ దినాన్ని నిర్వ‌హించారు.

నాడు వెన్నుపోటు, నేడు ఓటు పోటు అనే నినాదంతో వైసీపీ నిర‌స‌న చేప‌ట్టింది. ప్ర‌జ‌ల ప్ర‌త్య‌క్ష ఓటుతో ఎన్నిక కాకుండా, క‌లెక్ట‌ర్ నేతృత్వంలో నియ‌మితులైన మున్సిప‌ల్ చైర్మ‌న్‌తో పాటు 52 మంది కౌన్సిల‌ర్లు ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న నేప‌థ్యంలో రాచ‌మ‌ల్లు త‌న‌దైన స్టైల్‌లో ఆందోళ‌న‌కు పిలుపు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా శివ‌ప్ర‌సాద్‌రెడ్డి మౌనంగా, ప్ర‌శాంతంగా త‌న నిర‌స‌న కొన‌సాగించారు.

ప్రొద్దుటూరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌తో నామినేష‌న్లు వేయించ‌క‌పోవ‌డం, అలాగే కొంత మందితో మాత్ర‌మే వేయించ‌డం తీవ్ర వివాదానికి దారి తీసింది.

నామినేష‌న్లు వేసిన కొద్ది మంది వైసీపీ అభ్య‌ర్థుల‌వి కూడా అక్ర‌మంగా తిర‌స్క‌రించార‌ని రాచ‌మ‌ల్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. కేవ‌లం త‌న స‌తీమ‌ణి ర‌మాదేవి నామినేష‌న్ మాత్ర‌మే చెల్లుబాటు అయ్యేలా టీడీపీ కుట్ర‌ల‌కు పాల్ప‌డింద‌ని రాచ‌మ‌ల్లు ఆరోపించారు.

తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌తి ఒక్క‌రూ రాజీనామా చేయాల్సిందే అనే రాచ‌మ‌ల్లు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి తీరును రాచ‌మ‌ల్లు తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ వ‌చ్చారు.

మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా ఎమ్మెల్యే త‌మ్ముడు రాఘ‌వ‌రెడ్డి, అలాగే మిగిలిన స‌భ్యులు బాధ్య‌త‌లు తీసుకుంటున్న సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ప్ర‌జాద్రోహ దినం చేప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

7 Replies to “నాడు వెన్నుపోటు … నేడు ఓటు పోటు”

  1. పాపం బుర్ర దొ”బ్బి గుర్తు లేదు కానీ…మధ్య లో వచ్చిన గొ*డ్డలి పోటు ఫేమస్ 

Comments are closed.