ఒకే ఒక్క వేడుక.. ఎన్నో ఆసక్తికర పరిణామాలు.. అంతకుమించిన రాజకీయ, వ్యక్తిగత చర్చలు. అనిరుధ్ – కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇప్పుడీ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారింది. వాళ్ల రిసెప్షన్ ఎలా జరిగిందనే విషయాన్ని పక్కనపెడితే, అక్కడ కనిపించిన కొన్ని దృశ్యాలు కొత్త చర్చకు దారితీశాయి.
అనిరుధ్ – కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తమిళనాడు రాజకీయాలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం విజయ్ ఈ వేడుకకు హాజరు కావడం ఒక ఎత్తయితే.. అక్కడ ఆయన కలిసిన వ్యక్తులు, వారితో వ్యవహరించిన తీరు మరో ఎత్తు. గతంలో విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగిన పలువురు ప్రముఖులు ఒకే వేదికపై ఆప్యాయంగా కనిపించడం అందర్నీ ఆకర్షించింది.
అందరిలోకీ ఎక్కువగా ఆసక్తి రేపిన అంశం విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం హాజరవ్వడం. విజయ్‌తో వైవాహిక బంధానికి ముగింపు పలకాలని భావించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగీత.. ఆ తర్వాత ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామాల తర్వాత ఆమె బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. పైగా విజయ్ వచ్చిన కార్యక్రమానికి ఆమె వచ్చారు.
దీంతో విజయ్, సంగీత మళ్లీ కలిసిపోయారా? వారి మధ్య విభేదాలు తొలగిపోయాయా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీనికి మరింత బలం చేకూరుస్తూ,ఈ వేడుకకు విజయ్ తో పాటు త్రిష హాజరుకాలేదు. అయితే సంగీత వచ్చినా, విజయ్-సంగీత కలవలేదు. ఫంక్షన్లో వేర్వేరుగా కనిపించారు.
ఇక ఈ వేడుకలో మరో ఆసక్తికర సన్నివేశం విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్ ఆప్యాయంగా పలకరించుకోవడం. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.
విజయ్ విజయంపై రజినీకాంత్ స్పందించిన తీరు, ఆ తర్వాత ఆయన ఇచ్చిన వివరణలు కూడా అనేక ఊహాగానాలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకే వేదికపై చిరునవ్వులతో పలకరించుకోవడం, కలిసి ఫొటోలకు పోజులివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇన్నాళ్లూ ప్రచారంలో ఉన్న విభేదాలకు తెరపడిందా? ఇద్దరి మధ్య మళ్లీ సాన్నిహిత్యం పెరిగిందా అనే చర్చ మొదలైంది.
విజయ్, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మధ్య చోటుచేసుకున్న పలకరింపు కూడా అంతే ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా తలపడిన ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒకే వేదికపై ఆప్యాయంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.
ఒకవైపు విజయ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మరోవైపు స్టాలిన్ ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్నారు. రాజకీయంగా ఎవరి దారి వారిదే అయినప్పటికీ.. ఈ వేడుకలో మాత్రం ఇద్దరూ స్నేహపూర్వకంగా కనిపించారు. పైగా మొన్నటివరకు విజయ్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్ కూడా అదే వేదికపై విజయ్ను ఆలింగనం చేసుకున్నారు.
ఇలా ఎన్నో ఆసక్తికర ఘటనలకు, మరెన్నో అనుమానాలకు కేంద్ర బిందువుగా మారింది అనిరుధ్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్. అయితే ఒక ఫంక్షన్లో ఇలా ఆప్యాయంగా పలకరించుకున్నంత మాత్రాన వారి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని చెప్పలేం.
కానీ ఇన్నాళ్లూ దూరంగా ఉన్నారంటూ ప్రచారం జరిగిన వ్యక్తులంతా ఒకే వేదికపై ఇలా సడెన్‌గా ప్రత్యక్షమవ్వడంతో ఈ రిసెప్షన్ తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.

బొక్క టాపిక్‌గా మారింది… పెళ్లి వేడుకకు వెళ్లి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, నీ అంక్కా, నీ అంయ్యా అని తిట్టుకుంటారా… బొంగులో అనాలిసిస్!
పెళ్ళి వేడుకలో ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోలేదని నీకు disappointment గా ఉన్నట్లుంది.
రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ, వ్యక్తిగత వైరం ఉండకపోవచ్చు. ప్రమాణస్వీకారానికి ముందు స్టాలిన్ కలిసి వచ్చాడు విజయ్..
Ento Vijay gari meeda neeku special intrest…