మేయర్ మినహా మిగతా వారంతా ప్రమాణ స్వీకారం

ఏపీలో అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ఈ నెల 23న, సోమవారం ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకోనుంది.

ఏపీలో అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ఈ నెల 23న, సోమవారం ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకోనుంది.

ఏపీ వ్యాప్తంగా 13 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలాగే 87 మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారాలు సోమవారం జరగాల్సి ఉంది. అయితే విశాఖలో మాత్రం మేయర్ ప్రమాణ స్వీకారం చేయడం లేదు.

మొత్తం 120 మంది కార్పొరేటర్లు తొలుత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. అనంతరం జీవీఎంసీ తొలి సమావేశం వాయిదా పడుతుంది.

మేయర్‌గా గెలుపొందిన టీడీపీ మహిళా నాయకురాలు ముక్కా శ్రావణి తండ్రి రెండు రోజుల క్రితం మరణించడంతో ఆమె ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ మేరకు ఆమెకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.

దీంతో శ్రావణి మేయర్‌గా తదుపరి సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1955లోని సెక్షన్ 673-ఏ(2) ప్రకారం, ఎన్నికైన సభ్యులు తమ పదవీకాలం ప్రారంభమైన తేదీ నుంచి మూడు నెలల్లోగా లేదా ఆ తేదీ తర్వాత జరిగే కార్పొరేషన్ తొలి మూడు సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేయవచ్చని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిబంధన ప్రకారం మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి తదుపరి సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చని పేర్కొన్నారు.

ఇక ఈ నెల 1న జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మేయర్‌గా పోటీ చేసిన శ్రావణి మంచి ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే, ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్ మరణించడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం నుంచి తాజాగా వచ్చిన ఉత్తర్వులతో మేయర్ ప్రమాణ స్వీకారానికి రానున్న రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తోంది.

వైసీపీ నుంచి 13 మంది జీవీఎంసీకి ఎన్నికయ్యారు. దీంతో కొత్త సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పార్టీ వారికి దిశానిర్దేశం చేయనుంది. అలాగే, ఈ 13 మందిలో ఫ్లోర్ లీడర్‌తో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను ఎంపిక చేసి, బలమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

3 Replies to “మేయర్ మినహా మిగతా వారంతా ప్రమాణ స్వీకారం”

  1. 13 మంది తో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అంటే…అన్న 11 తో ప్రతిపక్ష పాత్ర పోషించని ఎ*డ్డీ ఎదవ అని వల్లే చెప్తున్నారా?

Comments are closed.