ఎక్స్ క్లూజివ్.. సలార్-2 మరింత లేటు

ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావాల్సిన సలార్-2 ఈపాటికే సెట్స్ పైకి రావాలి.

ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావాల్సిన సలార్-2 ఈపాటికే సెట్స్ పైకి రావాలి. కానీ ఎన్నో కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడీ సినిమా మరింత ఆలస్యం కాబోతోంది.

మొన్నటివరకు డ్రాగన్ షూట్ లేట్ అవ్వడం వల్ల, మరోవైపు ప్రభాస్ కాల్షీట్లు ఎడ్జెస్ట్ కాకపోవడం వల్ల సలార్-2 సెట్స్ పైకి రావడానికి ఇబ్బందిగా ఉందని అంతా అనుకున్నారు. అది నిజం కూడా. కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది.

సలార్-2 సినిమా కథకు కొన్ని మార్పుచేర్పులు చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ మేరకు డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత కొన్నాళ్ల పాటు మళ్లీ స్క్రిప్ట్ పై కూర్చోబోతున్నాడు. అదీ సంగతి.

నిజానికి సలార్ కథ రాసుకున్నప్పుడే రెండు భాగాలకు సంబంధించిన కథ, స్క్రీన్ ప్లేతో పాటు పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా జరిగిన డిస్కషన్ లో అక్కడక్కడ మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించాడు.

సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్ చిత్రం 2023లో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా తర్వాత కల్కి, రాజాసాబ్, ఫౌజీ లాంటి సినిమాలతో బిజీ అయ్యాడు ప్రభాస్. అటు నీల్ కూడా డ్రాగన్ పనిలో పడ్డాడు. అలా ఈ సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యమౌతూనే ఉంది.

One Reply to “ఎక్స్ క్లూజివ్.. సలార్-2 మరింత లేటు”

Comments are closed.