కొనసాగుతున్న వాయిదాల పర్వం.. ఛాప్టర్-2

లెక్కప్రకారం 27న రిలీజ్ అవ్వాలి మైసా. రష్మిక లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు ఫైనల్ కాపీ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది.

భోగి, హైందవ, ఇట్లు అర్జున లాంటి సినిమాలు వాయిదా పడ్డాయని చెప్పుకున్నాం. ఆ పర్వంలో ఇది ఛాప్టర్-2. మరికొన్ని రోజుల్లో రాబోతున్న మైసాతో పాటు క్రిస్మస్ కు రావాల్సిన కింగ్-100, నాగచైతన్య విరూపాక్ష సినిమాల విడుదలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లెక్కప్రకారం 27న రిలీజ్ అవ్వాలి మైసా. రష్మిక లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు ఫైనల్ కాపీ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. దీంతో సెన్సార్ ఫార్మాలిటీస్ ఆలస్యమౌతున్నాయి. సోమ, మంగళవారంలో సెన్సార్ పూర్తవ్వకపోతే ఈ సినిమా ఈ నెలలో రానట్టే అంటున్నారు.

అటు నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ పరిస్థితి కూడా అలానే ఉంది. ఫస్ట్ కాపీ ఇంకా రెడీ కాలేదు. దీంతో సెన్సార్ ఆలస్యమయ్యేలా ఉంది. సెన్సార్ లేట్ అయితే సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇటు మైసా, అటు వృషకర్మ.. రెండు సినిమాల రిలీజులు సెన్సార్ పైనే ఆధారపడి ఉన్నాయి. రీసెంట్ గా సెన్సార్ నిబంధనలు మారిన సంగతి తెలిసిందే. ఫస్ట్ కాపీ సిద్ధమైతే తప్ప సెన్సార్ అధికారులు సినిమా చూడడం లేదు. పైగా సెన్సార్ కోసం ముందుగానే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కొత్త నిబంధనల వల్ల మైసా, వృషకర్మ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. సోమవారానికి ఈ రెండు సినిమాలపై ఓ క్లారిటీ వస్తుంది.

ఈ రెండు సినిమాలంటే దగ్గర్లో ఉన్నాయి కాబట్టి అనుకోవచ్చు. కానీ ఆశ్చర్యంగా కింగ్-100 సినిమా విడుదలపై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.

క్రిస్మస్ బరిలో ఈ సినిమా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ కొత్త ఊహాగానం మొదలైంది. దీనికి సెన్సార్ కారణమా, పోస్ట్ ప్రొడక్షన్ కారణమా, మరో సినిమాతో కాంపిటిషన్ కారణమా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పుడీ సినిమాల్లో ఏది వాయిదా పడినా, ఆ ప్రభావం మరికొన్ని సినిమాలపై పడుతుంది. క్రిస్మస్, సంక్రాంతికి ఎలాగూ స్లాట్స్ ఖాళీ లేవు. సో.. ఇలాంటి టైమ్ లో సినిమా వాయిదా పడితే, ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే.

One Reply to “కొనసాగుతున్న వాయిదాల పర్వం.. ఛాప్టర్-2”

Comments are closed.